Advertisement
Google Ads BL

సర్కారు వారి పాట సీక్రెట్స్ రివీల్ చేసిన మహేష్


మహేష్ బాబు ప్రస్తుతం ఈ ఆదివారం డిసెంబర్ 5 న ఎన్టీఆర్ ఎవరి మీలో కోటీశ్వరులు షో లో గేమ్ ఆడుతున్నాడు. మహేష్ - ఎన్టీఆర్ కాంబో ఎపిసోడ్ జెమినీ ఛానల్ ఆదివారం రాత్రి 8.30 నుండి 10 గంటలవరకు ప్రసారం చేసింది. ఆ షో లో మహేష్ బాబు ని అన్నా అంటూనే ఎన్టీఆర్ మంచి నీళ్లు తాగించడానికి అంటే టెంక్షన్ పెట్టడానికి చాలా ట్రై చేసాడు. కానీ మహేష్ మాత్రం కామెడీ చేస్తూనే.. ఎన్టీఆర్ కే చుక్కలు చూపించాడు. ఒక్క ప్రశ్నకి ఒకే సమాధానం.. మధ్యలో ఇంకా ప్రశ్నలు లేవు అంటూ మహేష్ ఎన్టీఆర్ ని ఆటపట్టించాడు. ఇక ప్రశ్నలకు మధ్యలో పలు పర్సనల్ విషయాలని, కెరీర్ విషయాలని ఈ ఇద్దరూ స్టార్స్ సరదాగా బుల్లితెర ప్రేక్షకులతో పంచుకోవడం ఈ షో కి హైలెట్ గా నిలైహ్చింది.

Advertisement
CJ Advs

ఈ ఎవరు మీలో కోటీశ్వరులు షో లో ఎన్టీఆర్ మహేష్ రీసెంట్ మూవీ సర్కారు వారి పాట గురించి చెప్పమనగానే.. చాలా బావుంది.. కొత్త ఎక్సపీరియన్స్, సర్కారు వారి పాటలో పోకిరి ఫ్లేవర్ ఉంటుంది.. పూరి జగన్నాధ్ గుర్తుకు వస్తాడు.. చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చేస్తున్నాను.. పోకిరి సినిమాలోలా చాలా రకాల షేడ్స్ నా పాత్రలో ఉంటాయి.. ఇక కోవిడ్ వలన సర్కారు వారి పాట స్క్రిప్ట్ మీద చాలా రోజులు ట్రావెల్ చేసాము అంటూ మహేష్ సర్కారు వారిలో పాట ముచ్చట్లను ఎన్టీఆర్ షో లో రివీల్ చేసి మహేష్ ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చేసాడు.      

Mahesh Babu Reveals Sarkaru Vaari Paata Secrets:

Mahesh Babu in NTR Evaru Meelo Koteeswarulu Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs