Advertisement
Google Ads BL

కత్రినా - విక్కీ పెళ్ళికి నన్ను పిలవలేదు


బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే.. అది కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ ల పెళ్లి. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్న విషయం మీడియా కోడై కూస్తుంది కానీ.. పెళ్లి చేసుకోబోతున్న జంట మాత్రం ఈ విషయాన్ని మీడియాకి చెప్పకుండా పెళ్లి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ పెళ్లి విషయం ఎంతగా హైలెట్ అవుతుందో.. అంతగా.. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లు ఆహ్వానించిన సెలబ్రిటీస్ పై ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ ని విక్కీ అండ్ కత్రినాలు ఇన్వైట్ చేసి వాళ్ళకి ఫోన్ నాట్ అలోవెడ్ అనే కండిషన్ కూడా పెట్టినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

కానీ కత్రినా మాజీ ప్రియుడు, కో స్టార్ సల్మాన్ ఖాన్ ని కానీ, ఆయన ఫ్యామిలీని కానీ తన పెళ్లి కి ఇన్వైట్ చెయ్యకపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక తాజాగా విక్కీ కౌశల్ తన కో స్టార్, ఎంతో అనుబంధం ఉన్న కియారా అద్వానీని కూడా తన పెళ్ళికి ఆహ్వానించలేదనే అనే విషయాన్ని కియారా అద్వానీని మీడియా ముఖంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కియారా అద్వానీ మాట్లాడుతూ.. విక్కీ - కత్రినా పెళ్లికి సంబంధించిన సమాచారం తనకు తెలియదు అని, వారిద్దరు నిజంగా పెళ్లి చేసుకొంటున్నారా.. అయితే నాకు ఈ పెళ్ళికి ఎలాంటి ఇన్విటేషన్ లేదు. వారి పెళ్ళికి ఇప్పటి వరకు నాకు ఆహ్వానం అందలేదు అంటూ కియారా అద్వానీ తనని కత్రినా కానీ, విక్కీ కానీ పెళ్ళికి పిలవలేదనే విషయాన్ని రివీల్ చేసింది.

Katrina - Vicky did not invite me to the wedding: Kiara:

Kiara Advani not invited to Katrina Kaif-Vicky Kaushal wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs