బిగ్ బాస్ సీజన్ 5 13 వ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ వివరాలు ఎప్పటిలాగే శనివారమే బయటికి వచ్చేసాయి. ప్రతి ఆదివారం ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడుతున్న కంటెస్టెంట్ వివరాలు శనివారం రాత్రి నాగార్జున ఎపిసోడ్ వచ్చే ముందు అంటే.. శనివారం రాత్రి ఎనిమిది గంటలకే బిగ్ బాస్ లీకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వారం శ్రీరామ చంద్ర, సిరి, కాజల్, మానస్, ప్రియాంక సింగ్ లు నామినేషన్స్ లో ఉన్నారు. అందులో మొదటి నుండి ప్రియాంక సింగ్, కాజల్ లు ఓటింగ్ లో లీస్ట్ లో ఉంటూ వచ్చారు. అయితే ముందు నుండి ప్రియాంక సింగ్ డేంజర్ జోన్ లోనే ఉంది అన్నారు.
అలాగే మిస్సెడ్ కాల్ డేటా తో చివరికి ఈవారం హౌస్ లో గ్లామరస్ గా ప్రొజెక్ట్ అయ్యి.. 12 వారాల వరకు మానస్ వెంట తిరిగి.. చివరి వారంలో మానస్ తో డిస్టెన్స్ ని మెయింటింగ్ చేస్తూ శ్రీరామ చంద్రకి సేవలు చేస్తున్న ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ ని వీడింది. మానస్ తో క్లోజ్ గా మూవ్ అయిన ప్రియాంక చాలా అందంగా రెడీ అవుతూ బిగ్ బాస్ కి గ్లామర్ ని చూపించింది. మానస్ మాత్రం నా నుండి ఏదో ఆశిస్తున్నావ్ అనగానే బాగా హార్ట్ అయిన ప్రియాంక మానస్ కి దూరంగా ఉంటుంది.. తాజాగా ప్రియాంక హౌస్ నుండి రిలిమినేట్ అయిన విషయం బయటికి వచ్చేసింది.