రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల కలయికలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ జనవరి 7 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈలోపు ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని రాజమౌళి వేగవంతం చెయ్యడమే కాదు.. సినిమా రిలీజ్ కి ఏ ఏ అడ్డంకులు ఉన్నాయో వాటిని తప్పించుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే తనకి పోటీ వస్తున్న గంగూభాయ్ కతీయవాది ని వాయిదా వేసుకునేలా చేసన రాజమౌళి.. పవన్ భీమ్లా నాయక్ ని కూడా రేస్ నుండి తప్పించే ప్లాన్ లో ఉన్నారంటున్నారు. మరోపక్క తెలంగాణ మంత్రి తలసానిని సినిమా ఇండస్ట్రీ పెద్దలతో కలిసి వెళ్లి టికెట్ రేట్స్ గురించి చర్చించి వచ్చారు.
ఇక డిసెంబర్ 3 న ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా రాజమౌళి ముందుగా ప్రకటించగా.. సిరివెన్నెల మరణంతో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ పోస్ట్ పోన్ అయ్యింది. ఆ ట్రైలర్ ని ఇప్పుడు డిసెంబర్ 9న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 9 న ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా.. ఎన్టీఆర్ కొమరం భీం, రామ్ చరణ్ అల్లూరిగా పరుగులు పెడుతున్న పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ తో మెగా, నందమూరి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.