Advertisement
Google Ads BL

భీమ్లా నాయక్ నుండి అడివి తల్లి మాట పాట


పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే లో మలయాళ హిట్ ఫిలిం అయ్యప్పన్ కోషియం కి రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కింది. భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదలకాబోతుంది. దానితో మేకర్స్ భీమ్లా నాయక్ ప్రమోషన్స్ వేగవంతం చెయ్యడం.. ఇప్పటికే మూడు పాటలను రిలీజ్ కూడా చేసారు. అయితే నాలుగో పాటని రిలీజ్ చేద్దామనుకున్న టైం లో త్రివిక్రమ్ దగ్గర బంధువు, ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల అకాల మరణంతో భీమ్లా నాయక్ 4th సింగిల్ ని వాయిదా వేశారు. అప్పుడు వాయిదా వేసిన పాట అడవి తల్లిని ఈరోజు శనివారం విడుదల చేసారు. 

Advertisement
CJ Advs

ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి పాడారు. పాటలో ఒక పక్క లిరిక్స్‌తో పాటు మరోవైపు పవన్, రానాల విజువల్స్ హైలైట్ గా కనిపిస్తున్నాయి. థమన్ మళ్ళీ ఈ సినిమాకి తన ట్యూన్ తో అవుట్ స్టాండింగ్ వర్క్ ని చూపించాడు. రానా - పవన్ కళ్యాణ్ పాత్రల తాలూకు విజువల్స్ తో ఎమోషనల్ గా అడవి తల్లి మాట పాట ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా జనవరి 12 న రిలీజ్ కాబోతున్నట్టుగా మేకర్స్ పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ వైఫ్ గా నిత్య మీనన్, రానా వైఫ్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సముద్ర ఖని కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Bheemla Naik Adavi Thalli Maata Song Out Now:

Pawan Kalyan Bheemla Naik Adavi Thalli Maata Song Out Now
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs