Advertisement
Google Ads BL

మాజీ మంత్రి రోశయ్య కన్నుమూత.. చిరు సంతాపం


మాజీ మంత్రి రోశయ్య కన్నుమూత. కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగిన రోశయ్య.. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసారు. ఈ రోజు ఉదయమే బీపీ డౌన్ కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళిన కుటుంబ సభ్యులు.. స్టార్ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి రోశయ్య మృతి చెందినట్లుగా  తెలుస్తుంది. ఏపీ రాజకీయాల్లో కీలక బాధ్యతలు 

Advertisement
CJ Advs

చేపట్టిన రోశయ్య తమిళనాడు గవర్నర్ గా కూడా పని చేసారు. కొణిజేటి రోశయ్య గారు 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో రోశయ్య జన్మించారు.  ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆయన మొత్తం 18 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్న రెవెన్యూ శాఖ మంత్రిగా నిలిచారు. ఆయన వాక్చాతుర్యంతో అసెంబ్లీలో అందర్నీ హడలెత్తించిన వారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. రోశయ్య మరణంతో రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం

ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత 

రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడం లో ఓ రుషి మాదిరిగా సేవ చేశారు 

రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది

రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

నన్ను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.. 

వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య : చిరంజీవి

Former Minister Rosaiah Passed away:

MegaStar Chiranjeevi pays tribute to Former Minister Rosaiah
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs