Advertisement
Google Ads BL

అఖండ కి పెను గండం


బాలకృష్ణ - బోయపాటి.. అదిరిపోయే కాంబినేషన్ అని మరోసారి అఖండ మూవీ తో నిరూపించారు. బోయపాటి మేకింగ్, బాలయ్య అదిరిపోయే పెరఫార్మెన్స్ కి ఆ కాంబోలో హిట్స్ కాదు.. బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతోంది. సింహ, లెజెండ్ మూవీస్ లో బాలకృష్ణ పెరఫార్మెన్స్ ని మాస్ ప్రేక్షకులు ఇప్పటికి మర్చిపోలేరు.. అంతలోనే అఖండ అంటూ అఘోర గెటప్ లో బాలయ్య చేసిన పెరఫార్మెన్స్ కి ఇప్పుడు మాస్ అండ్ నందమూరి ఫాన్స్ మీసాలు మెలేస్తున్నారు. నందమూరి బాలయ్య నటనకు ఫాన్స్ రెచ్చిపోయి పండగ చేసుకుంటున్నారు. అఖండ కి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ పడడమే కాదు.. ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ పడిపోయింది. ఇక అఖండ మూవీకి ఫస్ట్ డే అదిరిపోయే ఓపెనింగ్స్ పడినాయి. 

Advertisement
CJ Advs

అంతా బాగానే ఉంది.. కానీ అఖండ ని ఇప్పుడు పెను గండం వెంటాడుతుంది. ఇప్పటికే ఆంధ్రాలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అకాల వర్షాలతో అతలాకుతలం అవ్వగా.. ఇప్పుడు అదే ఆంధ్రాలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం పై మరో తుఫాను విరుచుకుపడుతుంది. ఇప్పటికే పలు జిల్లాలో ఈ తుఫాను వలన స్కూల్స్ కి సెలవలు కూడా ప్రకటించేసింది ఏపీ ప్రభుత్వం, మరి భారీ వర్షాలతో ఎవరూ థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూసే తీరిక, ఓపిక ఉండదు. అఖండ ప్రభంజనం ఈ అకాల వర్షాలు అడ్డుకట్టవేస్తున్నాయి. కరోనా తర్వాత పెద్ద సినిమాగా రిలీజ్ అయిన అఖండ మూవీ కి హిట్ టాక్ పడింది.. అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే.. ఇప్పుడు అఖండ ని ఈ తుఫాను గండం వెంటాడుతుంది. దానితో నందమూరి ఫాన్స్ కాస్త వర్రీ అవుతున్నారు.

Storm that tensions Akhanda:

Andhra cyclone tensions Akhanda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs