Advertisement
Google Ads BL

ఇప్పటికైనా రిలీజ్ డేట్ ఇస్తారా..


పాన్ ఇండియా ఫిలిమ్స్, భారీ బడ్జెట్ మూవీస్ అన్ని ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ ఇవ్వడమే కాదు.. ఆ సినిమాల ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. టాలీవుడ్ లో ఆల్మోస్ట్ ఒకేసారి మొదలు పెట్టిన ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ డేట్స్ వచ్చేసాయి. ఇక గత ఏడాది నవంబర్ లో పట్టాలెక్కిన అల్లు అర్జున్ - సుకుమార్ ల పాన్ ఇండియా ఫిలిం పుష్ప డిసెంబర్ 17న రిలీజ్ కాబోతుంది. అయితే గత ఏడాది బాలీవుడ్ అండదండలతో మొదలైన విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో మొదలైన లైగర్ మూవీ రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వడం లేదు.

Advertisement
CJ Advs

లైగర్ మూవీకి కీలకమైన షెడ్యూల్ యుఎస్ షెడ్యూల్ ఉంది.. అది పూర్తి కాగానే లైగర్ మూవీ రిలీజ్ వచ్చేస్తుంది.. 2022 మనదే అంటూ విజయ్ దేవరకొండ పబ్లిక్ ఈవెంట్స్ లో చెబుతున్నాడు. మరి యుఎస్ షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా లైగర్ కంప్లీట్ చేసుకున్నట్టుగా అప్ డేట్ వచ్చేసింది. మరి ఇప్పటికైనా విజయ్ లైగర్ రిలీజ్ డేట్ అప్ డేట్ వస్తుందా అని విజయ్ ఫాన్స్ పూరి కి, ఛార్మి కి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఇక కరణ్ జోహార్, పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ పై పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలే ఉన్నాయి. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Will there be a release date yet ..:

Vijay Devarakonda Liger Release date update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs