బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన అఖండ మూవీ నిన్న గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లెజెండ్, సింహ మూవీ లతో పోలిక పెట్టి అఖండ పై నందమూరి అభిమానులు భారీ ఆశలు పెంచుకున్నారు. బోయపాటి బాలకృష్ణ ని అఖండ గా ఎంత పవర్ ఫుల్ గా చూపించాలో అంత పవర్ ఫుల్ గా అఘోర పాత్రలో చూపించి ఫాన్స్ కి కిక్ ఇచ్చారు. అఖండ మూవీకి పాజిటివ్ టాక్ పడడమే కాదు.. సోషల్ మీడియాలో అఖండ మూవీ పై ఫాన్స్ మాత్రమే కాదు.. మాస్ ప్రేక్షకులు వేసిన పాజిటీవ్ ట్వీట్స్ కి అఖండ టీం సంబరపడిపోతుంది. బాలకృష్ణ, బోయపాటి, నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి అఖండ టీం కలిసి మహేష్ AMB మాల్ లో అఖండ ని వీక్షించారు.
ఇక ఈ గురువారం రిలీజ్ అయిన అఖండ మూవీలో రెండే రెండు హైలైట్స్ అంటూ ఫాన్స్, సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. అందులో ముఖ్యంగా బాలకృష్ణ కేరెక్టర్స్ మురళీకృష్ణ గా బాలయ్య అందమైన రూపం, అఘోరాగా బాలకృష్ణ శివతాండవం ఫాన్స్ ని విజిల్స్ వేయించే రేంజ్ లో ఉంటే.. థమన్ ఇచ్చిన మ్యూజిక్, నేపధ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసింది అని, అఖండ యాక్షన్ సీన్స్ లో, బాలయ్య ఎలివేషన్స్ సీన్స్ ని థమన్ మ్యూజిక్ నిలబెట్టింది అని.. బాలయ్య పెరఫార్మెన్స్, ఆయన లుక్, థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మెయిన్, ఆ ద్భుతమైన హైలైట్స్ అంటున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, బోయపాటి మేకింగ్ బావున్నా.. ముఖ్యంగా బాలయ్యని పొగడని వాళ్ళు, థమన్ మ్యూజిక్ ని ఎత్తని వాళ్ళు లేరు.