Advertisement
Google Ads BL

కంగ్రాట్స్ 'బాలా బాబాయ్' అంటున్న యంగ్ టైగర్


ప్రస్తుతం టీడీపీ శ్రేణులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. నిన్నటివరకు ఎన్టీఆర్ వస్తే టీడీపీ బాగుపడుతుంది అన్నవాళ్ళే.. నేడు నారా భువనేశ్వరి ఇష్యులో ఎన్టీఆర్ మాట్లాడిన తీరుకి టీడీపీ సీనియర్ నాయకులూ ఎన్టీఆర్ ని తిట్టిపోస్తున్నారు. అయితే బాలకృష్ణతో అంటే.. నందమూరి ఫ్యామిలీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తత్సంబందాలు తక్కువే.. హరికృష్ణ మరణం, ఎన్టీఆర్ పెళ్లి నందమూరి ఫ్యామిలీని దగ్గర చేసినా.. ఎన్టీఆర్ ని ఇప్పటికి కాస్త దూరంగానే ఉంచుతారు.. ఎన్టీఆర్ కూడా అంటీముట్టనట్లుగానే ఉంటాడు. కళ్యాణ్ రామ్ మాత్రం అటు ఎన్టీఆర్ ఇటు ఫ్యామిలీని రెండిటిని మ్యానేజ్ చేస్తున్నాడు. అయితే బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ అనే ప్రచారం జరిగినా.. ఎన్టీఆర్ రాలేదు.. అక్కడ భారీ ట్విస్ట్ తో అల్లు అర్జున్ ఎంటర్ అయ్యాడు.

Advertisement
CJ Advs

అయితే నిన్న గురువారం విడుదలైన అఖండ మూవీ కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు సూపర్ స్టార్ మహేష్.. అదే రోజు రాత్రి పదిన్నరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అఖండ మూవీ ని చూసి తన స్పందనని సోషల్ మీడియాలో తెలియజేసాడు.. అఖండ మూవీ ఇప్పుడే చూశాను.. కంగ్రాట్స్ బాలా బాబాయ్ అంటూ ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అలాగే అఖండ టీం కి కూడా కంగ్రాట్స్ చెప్పాడు ఎన్టీఆర్. Just finished watching #Akhanda. Congrats Bala Babai and the whole team on scoring this resounding success. So many hardcore fan moments to enjoy !! అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ బోయపాటి తో దమ్ము సినిమా చేసాడు.. అలాగే థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాలు చేసాడు.. సో బాలా బాబాయ్ నటించిన అఖండ మూవీ చూసేసి ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెప్పెయ్యడం మాత్రం నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చింది. 

Akhanda revives Balakrishna and NTR bonding:

<div>NTR heaps praises on Balakrishna Akhanda</div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs