Advertisement
Google Ads BL

వావ్: మెగా154 అప్ డేట్ అదిరింది


మెగాస్టార్ చిరు స్పీడు చూస్తే యంగ్ హీరోస్ కూడా ఈర్ష్య పడే విధంగా సినిమాలు చేస్తున్నారు. ఆచార్య మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసిన చిరంజీవి.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ మూవీ ఓ చిన్న సైజ్ మల్టీస్టారర్ గా కాదు.. బడా మల్టీస్టారర్ గా ఉండబోతుంది అనే న్యూస్ మెగా ఫాన్స్ ని షేక్ చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. 

Advertisement
CJ Advs

ఇక తర్వాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ ని పూజ కార్యక్రమాలతో మొదలు పెడతామే తరువాయి.. ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లి షాకిచ్చారు.. మెహెర్ రమేష్ హైదరాబాద్ పాతబస్తీలో వేసిన స్పెషల్ సెట్ లో చిరు తో ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక మరో సినిమా మెగా154 ని బాబీ దర్శకత్వంలో మొదలు పెట్టిన చిరు ఆ సినిమా షూటింగ్ కూడా చేసేస్తున్నారు. పూనకాలు లోడింగ్ అంటూ మాస్ అవతార్ లో చిరు బాబీ ప్రాజెక్ట్ లో కనిపించబోతున్నారు. Mana Annayya Megastar @KChiruTweets Araachakam in full flow on the sets of #Mega154 in Hyderabad 💥💥 @dirbobby @ThisIsDSP @MythriOfficial 🔥🔥 అంటూ బాబీ.. చిరు బ్యాక్ లుక్ ఉన్న పిక్ తో సోషల్ మీడియాలో Chiru154 పై అప్ డేట్ ఇవ్వడంతో మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి.. ఫుల్ స్వింగ్ లో Chiru154 షూటింగ్ లో చిరు బ్యాక్ లుక్ ని చూసి సంబరపడిపోతున్నారు. 

Crazy update on Chiru 154 :

Interesting update on Chiru - Bobby Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs