Advertisement
Google Ads BL

పెళ్లి చేసుకుంటూ మాజీ లవర్ కి షాకిచ్చింది


కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ ల పెళ్లి వేడుకలు ఈనెల 7 నుండి 12 వరకు రాజస్థాన్ లో జరగనున్నాయి. విక్కీ - కత్రినా ల పెళ్లిలో సెలెబ్రిటీస్ సందడి ఉండబోతుంది. అయితే పెళ్ళికి సెల్ ఫోన్స్ నాట్ అలోవెడ్ అనే కండిషన్స్ పెట్టిన ఈ జంట.. 3వ తేదీ శుక్రవారం ముంబై లోని కోర్టులో తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోనున్నారు. ఈ కోర్టు పెళ్లిని ఎలాంటి హడావిడి లేకుండా ముగించేసి.. తర్వాత ఈ జంట రాజస్థాన్ కి పయనమవ్వబోతుంది. విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ పెళ్లి అనే విషయం బి టౌన్ లో చక్కర్లు కొట్టినా.. వారి నుండి మాత్రం ఎలాంటి స్పందనా లేదు.

Advertisement
CJ Advs

అయితే బాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్ ని కత్రినా - విక్కీ కౌశల్ లు తమ పెళ్ళికి పర్సనల్ గా ఇన్వైట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కత్రినా పెళ్లి చేసుకోబోతూ తన మాజీ లవర్, ఫ్రెండ్ అయిన సల్మాన్ ఖాన్ కి షాకిచ్చింది అనే న్యూస్ బి టౌన్ లో చక్కర్లు కొడుతోంది. కత్రినా కైఫ్, ఫ్రెండ్స్, సన్నిహితులని తన పెళ్ళికి ఇన్వైట్ చేసిన కత్రినా తన మాజీ బాయ్ ఫ్రెండ్ అయిన సల్మాన్ ని కానీ అయన ఫ్యామిలీని కానీ పెళ్ళికి పిలవలేదని, ఈ విషయాన్ని స్వయానా సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ చెప్పడం విశేషం. అయితే కత్రినా - సల్మాన్ ఖాన్ లు గతంలో ప్రేమించుకున్నా.. తర్వాత వీరికి బ్రేకప్ అయ్యింది. కానీ వీరిద్దరూ కలిసి ఇప్పటికి పలు సినిమాల్లో నటిస్తూ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. తాజాగా టైగర్ 3 లో వీరు కలిసి నటిస్తున్నారు. కత్రినా ఇప్పుడు సల్మాన్ ఖాన్ ని పెళ్ళికి పిలవకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 

Salman Khan and family not invited to Katrina Kaif:

Salman Khan, sisters not invited to Katrina Kaif wedding 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs