ఈ వారం బిగ్ మూవీస్, పాన్ ఇండియా మూవీస్ అప్ డేట్స్ తో ఫాన్స్ కి కంటి మీదకి కునుకు రావడం లేదు. పాన్ ఇండియా మూవీస్ అయిన ఆర్.ఆర్.ఆర్, పుష్ప ట్రైలర్స్ మూడు రోజుల తేడా తో రిలీజ్ అవుతున్నాయనగానే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫాన్స్ కి పండగ వచ్చేసినంత సంబరాలు చేసుకున్నారు. క్రేజీ పాన్ ఇండియా ఫిలిమ్స్, అలాగే రెండేళ్లుగా కరోనా కలవరంతో కొత్త, పెద్ద సినిమాలపై కరువాసిపోయిన ఫాన్స్.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు అప్ డేట్స్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ అన్ని భాషల్లో రేపు శుక్రవారం అంటే డిసెంబర్ 3 న రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. సిరివెన్నెల మృతితో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ పోస్ట్ పోన్ చేసారు.
ఇక పుష్ప ట్రైలర్ ట్రీట్ డిసెంబర్ 6 అంటూ మేకర్స్ ఎప్పుడో ప్రకటించేసారు.. అప్పుడే కౌన్ డౌన్ పోస్టర్స్ తో హడావిడి మొదలు పెట్టింది టీం. అయితే రేపు విడుదల కావాల్సిన ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ని డిసెంబర్ 6 న అంటే పుష్ప ట్రైలర్ రోజునే రిలీజ్ చెయ్యొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో రేజ్ అయ్యాయి. రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. అదే విధంగా అల్లు అర్జున్ - సుక్కు కాంబోలో రాబోతున్న పుష్ప మూవీపై అంతే అంచనాలున్నాయి. నిజంగా రెండు సినిమాల ట్రైలర్స్ ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం స్టార్ హీరోల ఫాన్స్ సోషల్ మీడియాలో యుద్దానికి దిగడం మాత్రం పక్కా..