నాగ చైతన్య సమంత కి విడాకులిచ్చేసి.. కూల్ గా సినిమాలు చేసుకుంటున్నాడు. సమంత మాత్రం చైతూ తో సపరేట్ అయ్యాక ఆధ్యాత్మిక యాత్రలు, ఫ్రెండ్స్ తో వెకేషన్స్ తిరిగి మాములు స్థితికి రావడమే తరువాయి షూటింగ్స్ తో బిజీ అయ్యింది. నాగ చైతన్య - సమంత విడిపోయాక నాగ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. సమంత వెళ్లిపోవడం బాధగా ఉంది అని, ఇద్దరూ కావాల్సిన వారంటూ సమంత ని తన ఫ్యామిలీ మెంబెర్ అని చెప్పకనే చెప్పాడు. ఇక తాజాగా సమంత కి హాలీవుడ్ ఆఫర్ రావడం వెనుక దగ్గుబాటి రానా ఉన్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బోల్డ్ కేరెక్టర్ తో అదరగొట్టే నటి కోసం వెతుకుతున్న హాలీవుడ్ మేకర్స్ కి రానా సమంత పేరు సూచించాడని అంటున్నారు.
ఫ్యామిలీ మ్యాన్ 2 తో అదరగపట్టేసిన సమంత అయితే.. ఆ సినిమాకి పర్ఫెక్ట్ అని రానా చెప్పడంతోనే హాలీవుడ్ మేకర్స్ అను పాత్ర కోసం సమంత ని సంప్రదించారని, అలా రానా సమంత కి హెల్ప్ చేస్తుందనే టాక్ నడుస్తుంది. మరి నాగ చైతన్య ని పెళ్లి చేసుకున్నాక సమంత అక్కినేని, అటు దగ్గుబాటి ఫామిలీస్ తో బాగా క్లోజ్ అయ్యింది. ఇక చైతూ తో డివోర్స్ అయ్యాక సమంత ఏం చేసినా.. వెంకీ కూతురు సోషల్ మీడియాలో హైలెట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు రానా కూడా సమంత సపోర్ట్ చేస్తున్నాడు. సో చైతూ తో బంధాలు తెంపుకున్నా.. సమంత మాత్రం అక్కినేని, దగ్గుబాటి ఫామిలీస్ అనుబంధాన్ని మాత్రం దక్కించుకుంది.