బిగ్ బాస్ సీజన్ 5 లో టికెట్ టు ఫినాలే అంటూ ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో సిరి బాల్స్ కోసం సన్నీ గేమ్ ఆడడంతో సిరి ఐస్ ట్యూబ్స్ లో కాళ్ళు పెట్టుకుని ఎక్కువ సేపు నించోవడంతో.. సిరి కాళ్ళకి ప్రాబ్లెమ్ అయ్యింది. దానితో ఆమెని మెడికల్ రూమ్ కి ఎత్తుకెళ్లారు షణ్ముఖ్, మానస్ లు. అయితే సిరి వచ్చి పడుకున్నాక షణ్ముఖ్.. నువ్ ఆలా ఎందుకు చేస్తావ్.. నేను కూడా కాళ్ళు ఐస్ ట్యూబ్ లోనే ఉంచాను. నాకెందుకు మంట రాలేదు అన్నాడు.. నా ఫ్రెండ్ వీక్ అంటే నేను ఒప్పుకోను.. అలా కాదు అన్నాడు. సిరి ఏడవగా.. ప్రియాంక షణ్ముఖ్ అన్నయ్య నువ్ అలా మాట్లాడొద్దు సిరి ఫీలవుతుంది, నీ స్ట్రెంత్ వేరు.. ఆమెది వేరు కదా అన్నా కూడా షణ్ముఖ్ మాత్రం సిరిపై ఫైర్ అయ్యాడు. అలాంటి వీక్ ఫ్రెండ్ నాకు అక్కర్లేదు అన్నాడు.. దానితో సిరి బాగా ఏడ్చింది.
ఇక సన్నీ బయట కూర్చుని నా వలనే సిరి అలా కళ్ళు ఐస్ ట్యూబ్స్ లో పెట్టింది అంటూ ఫీలయ్యాడు.. కానీ కాజల్ అది వాళ్ళ గేమ్ ప్లాన్ అంటూ సన్నీకి నచ్చ చెప్పింది. అంటే నన్ను బ్లేమ్ చేసి.. నన్ను తక్కువగా చూపించాలని సిరి అండ్ షణ్ముఖ్ చూస్తున్నారు. సిరి కావాలనే నన్ను ఇలా ప్రాజెక్ట్ చేస్తుంది అన్నాడు. పింకీ కూడా అలా చెయ్యడం నాకు నచ్చలేదని సన్నీ అనడంతో.. మానస్ కూడా దానికి వంత పాడాడు. ఇక ప్రియాంక శ్రీరామ్ దగ్గరకి వెళ్లి కాళ్ళకి మసాజ్ చేసింది. తర్వాత షణ్ముఖ్ - సిరులు రవి పేరు ఎందుకు తీశారురా.. వాళ్ళే నామినేట్ చేసి బయటికి పంపి టాస్క్ లో రవి పేరు తీసి సింపతీ కొట్టెయ్యల్ని చూసారు అంటూ సన్నీ - మానస్ మాట్లాడుకున్నారు.. ఇవి ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్..