Advertisement
Google Ads BL

దెబ్బకి దెయ్యం దిగింది


టీడీపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చుట్టూ తిరిగి టీడీపికి అధికారం పోయి, వైసిపి ప్రభుత్వంలో కేసులకు భయపడి జగన్ ప్రభుత్వంతో లాలూచీపడిన.. టిడిపి బహిష్కృత ఎమ్యెల్యే వల్లభనేని వంశీ.. వైసిపిలోకి వెళ్లి నానా తంటాలు పడుతున్నాడు. ఇక టిడిపి నుండి బయటికి వచ్చిన వల్లభనేని వంశి అప్పుడప్పుడు టిడిపి పై ఫైర్ అవుతూ జగన్ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నాడు. ఇక టిడిపి నుండి బయటికి వచ్చిన కొత్తల్లో నారా భువనేశ్వరిపై వంశీ సంచనలన వ్యాఖ్యలు చెయ్యడం, లోకేష్ పుట్టుకపై అడ్డదిడ్డంగా  మాట్లాడం చేసాడు. అప్పుడు టిడిపి శ్రేణులు లైట్ తీసుకున్నాయి. అదే మాటలను రీసెంట్ గా వంశీ కొడాలి నాని ఏపీ అసెంబ్లీలో మాట్లాడడంతో.. అది పెద్ద రచ్చ అయ్యింది. వంశీ వల్లభనేని, కొడాలి నాని లపై టిడిపి కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఫైర్ అవుతుండడం, అలాగే వారి మీద టిడిపి కార్యకర్తలు దాడి కూడా చెయ్యొచ్చనే అనుమానంతో వారికీ ఏపీ ప్రభుత్వం భద్రతను కల్పిస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా వల్లభనేని వంశీకి ఎక్కిన దెయ్యం దిగినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే..  రీసెంట్ గా నారా భువనేశ్వరిపై తాను చేసిన వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. నేను భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేశాను. చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నా.. ఎమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవం, ఆ నా వ్యాఖ్యలకు నేను బాధపడుతున్నా, టీడీపీలో నాకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి, భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా, కులం నుంచి వెలివేస్తారనే భయంతో క్షమాపణ చెప్పలేదు.. నేను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నా.. చంద్రబాబును కూడా క్షమాపణ కోరుతున్నా అంటూ ఓ ఛానల్ డిబేట్ లో వంశీ క్షమాపణలు చెప్పడం చూస్తే అందరూ వంశీకి దెబ్బకి దెయ్యం దిగింది అంటున్నారు. 

Vallabhaneni Vamsi apologises to Nara Bhuvaneswari:

Vallabhaneni Vamsi apologized to Nara Bhuvaneswari
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs