ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నాలుగు దక్షిణ కోస్తా జిల్లాలో కొన్నిరోజుల నుంచి అసాధారణ వర్షాలు పడుతున్నాయి. దీని వల్ల ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరిగింది. చాలా మంది నిరాశ్రయులయ్యారు. ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పాతిక లక్షల రూపాయల విరాళంగా అందచేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ అలా 25 లక్షల విరాళం ప్రకటించగానే.. మిగతా స్టార్ హీరోలైన రామ్ చరణ్, మహేష్ లు కూడా ఏపీ ప్రభుత్వానికి వరద సహాయం కింద విరాళాలు ప్రకటించడం విశేషం.
ఎన్టీఆర్:
ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వచ్చాయి. వాటి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సాయం చేసే దిశగా నేను చిన్న అడుగు వేశారు. అందులో భాగంగా రూ.25 లక్షలు విరాళం అందిస్తున్నాను అని తెలిపారు.
మహేష్ బాబు:
ఇటీవల వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యల నిమిత్తం సూపర్‌స్టార్ మహేష్ బాబు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25లక్షల విరాళం ప్రకటించారు.
రామ్ చరణ్:
ఏపీలో వరద బాధితులకు సాయం ప్రకటించిన మెగా స్టార్ చిరంజీవి బాటలోనే ఆయన తనయుడు రామ్ చరణ్
బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించిన రామ్ చరణ్
చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి ఏపీ ప్రభుత్వ సహాయ నిధి కి మొత్తం 50 లక్షల రూపాయలు విరాళం
ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ ముందు ఉంటుందనేది మరోసారి నిరూపించారని అంటోన్న అభిమానులు