ఆర్.ఆర్.ఆర్ షూటింగ్, ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్స్ పూర్తి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈమధ్యనే భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలిసి పారిస్ వెకేషన్స్ కి వెళ్ళాడు. అక్కడ కొడుకులతో ఎన్టీఆర్ క్యూట్ గా దిగిన ఫొటోస్ ని కూడా ఫాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇక వెకేషన్స్ నుండి రాగానే ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో బిజీ అవుతాడని అనుకున్నారు. అలాగే కొరటాల శివ తో ఫిబ్రవరి లో తన NTR30 మూవీ మొదలు పెట్టబోతున్నట్టుగా ఎన్టీఆర్ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.. అలాగే ఫామిలీ తో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ అర్ధాంతరంగా వెకేషన్స్ ముగించేసి హైదరాబాద్ వచ్చేసాడు.
భార్య, పిల్లను తీసుకుని పారిస్ ట్రిప్ మధ్యలోనే వదిలేసి హైదరాబాద్ కి రావడానికి.. కారణం సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయానికి ఎన్టీఆర్ నివాళులు అర్పించడానికి. నిన్న మంగళవారం ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో మరణించిన సిరివెన్నెల భౌతిక కాయానికి టాలీవుడ్ ప్రముఖులు బుధవారం ఉదయం ఫిలిం ఛాంబర్ లో నివాళులు అర్పించారు. సిరివెన్నెలతో ఎంతో అనుబంధం ఉన్న ఎన్టీఆర్ వెకేషన్స్ నుండి హైదరాబాద్ కి రావడంతోనే.. ఫిలిం ఛాంబర్ వద్ద సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంభ సభ్యులని ఓదార్చారు.