డిసెంబర్ 2న భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న బాలకృష్ణ - బోయపాటి క్రేజీ కాంబో అఖండ మూవీ పై అదిరిపోయే అంచనాలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో విడుదలకానున్న చిత్రంగా అఖండ కనిపిస్తుంది. నిన్నమొన్నటివరకు చిన్నా, మీడియం బడ్జెట్ మూవీస్ తో సరిపెట్టుకున్న ప్రేక్షకులకి అఖండ సినిమా తో మేకర్స్ ఆశలు రేపుతున్నారు. పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ తోనూ, బాలయ్య అఘోర లుక్, శ్రీకాంత్ విలన్ లుక్ తోనూ థమన్ మ్యూజిక్, బోయపాటి పవర్ ఫుల్ మేకింగ్ తోనూ అఖండ పై అందరిలో ఆసక్తి, అంచనాలు అంతకంతకు పెరిగేలా చేసారు. భారీ అంచనాలు నడుమ భారీగా విడుదలకానున్న అఖండ మూవీకి అన్ని ఏరియా లలో అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. లెజెండ్, సింహ లాంటి యాక్షన్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టిన కాంబోగా బాలయ్య - బోయపాటి ఉండడంతో.. అఖండ పై అంచనాలుతో అదిరిపోయే బిజినెస్ జరిగేలా చేసింది.
ఏరియాల వారీగా అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు మీకోసం..
ఏరియా - ప్రీ రిలీజ్ బిజినెస్ (కోట్లలో)
నైజాం - 11.0
సీడెడ్ - 11.0
ఉత్తరాంధ్ర - 5.80
ఈస్ట్ గోదావరి - 3.95
వెస్ట్ గోదావరి - 3.44
కృష్ణా - 3.82
గుంటూరు - 5.48
నెల్లూరు - 1.89
ఆంధ్ర అండ్ తెలంగాణ: 46.38 కోట్లు
ఇతర ప్రాంతాలు 4.40 కోట్లు
ఓవర్సీస్ 2.47
వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్ 53.25 కోట్లు