Advertisement
Google Ads BL

బ్రేకింగ్: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు


ప్రముఖ టాలీవుడ్ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ రోజు మధ్యాహ్నం 4.07 గంటల సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గత కొన్నిరోజులుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నారు. సిరివెన్నెల న్యుమోనియాతో నవంబర్ 24వ తేదీన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ICUలో ఆయనకి వెంటిలేటర్ మీద ఆయనకి చికిత్స అందిస్తున్నారు డాక్టర్స్. కానీ ఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన కన్ను మూసారు. 

Advertisement
CJ Advs

సిరివెన్నెల మరణంతో టాలీవుడ్ మరోసారి షాకైంది. నిన్నగాక మొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ చనిపోవడం, వెను వెంటనే సీత రామ శాస్త్రిగారిని కోల్పోవడంతో.. టాలీవుడ్ ప్రముఖులు షాకవుతున్నారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి గారు చివ‌ర‌గా నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో రెండు పాట‌లు రాయ‌డం జ‌రిగింది. అవే ఆయన చివ‌రి పాట‌లు కావ‌డం విషాద‌క‌రం.

సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టినతేదీ 20 మే, 1955.. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జన్మించారు.

1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంభం..

చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం..

కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాతో గుర్తింపు..

అదే సినిమా ఇంటిపేరుగా మారిపోయింది..

సిరివెన్నెల సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్న సీతారామశాస్త్రి..

దర్శకుడు కె.విశ్వనాధ్ తో అన్ని సినిమాలకు పనిచేసిన సిరివెన్నెల..

కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తాడు..

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు..

రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశీ కె.విశ్వనాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు..

2019లో పద్మశ్రీ వచ్చింది..

కెరీర్లో ఉత్తమ గేయరచయితగా 11 నంది అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్..

ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశాడు..

త్రిబుల్ ఆర్ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి..

తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి పనిచేసినారు సిరివెన్నెల

Sirivennela Seetharama Sastry is no more:

<span>Sirivennela Seetharama Sastry</span>&nbsp;is no more due to Pneumonia
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs