Advertisement
Google Ads BL

హద్దులు మీరుతున్న అభిమానం


స్టార్ హీరోల ఫాన్స్ కి ఆయా హీరోలపై ఎంతగా అభిమానం ఉంటుందో కొలతల్లో కొలవడం చాలా కష్టం, తమ హీరో సినిమా రిలీజ్ అవుతుంటే బ్యానర్లు కట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, అప్ డేట్ వస్తే సోషల్ మీడియాలో వైరల్ చెయ్యడం, తమ హీరోల కోసం, రక్తదానాలు చెయ్యడం, వందలమైళ్ళు నడిచి రావడం అబ్బో తమ అభిమానం చాటుకోవడం కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యని అభిమానులు స్టార్ హీరోల సొంతం. అదే అభిమానం స్టార్ హీరోల అభిమానుల మధ్యన వైరం పెరిగేలా చేస్తుంది. తమ హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ బ్యానర్స్ చించెయ్యడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానుల అభిమానం హద్దులు దాటిపోతుంది.  

Advertisement
CJ Advs

తమ అభిమాన హీరోల అప్ డేట్స్ కోసం ఆయా నిర్మాణ సంస్థలను బండ బూతులు తిట్టడమే కాదు.. సోషల్ మీడియాలో ఆ బూతులు ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు హీరోల ఫాన్స్. సర్కారు వారి పాట అప్ డేట్ కోసం మహేష్ అభిమానులు మైత్రి మూవీ మేకర్స్ ని, 14 రీల్స్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా ఆ హాష్ టాగ్ ట్రెండ్ చేసారు. ఇక ప్రభాస్ ఫాన్స్ అయితే రాధేశ్యామ్ నిర్మాతలు యువి క్రియేషన్స్ వారిని తిట్టని రోజే లేదు. ఇక డిసెంబర్ 17 న రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ పుష్ప మూవీ అప్ డేట్స్ ని సుకుమార్ అండ్ మైత్రి మూవీస్ వారు చాలా అలెర్ట్ గా ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తున్నారు.

కానీ పుష్ప మేకర్స్ మైత్రి వారిని అల్లు అర్జున్ ఫాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయి తిట్ల దండకం మొదలు పెట్టారు. కారణం ట్రైలర్ అప్ డేట్ కోసం.. మరి ఆ అప్ డేట్ ఇచ్చారు. కానీ అంతకుముందే అల్లు ఫాన్స్ ఇలా పుష్ప మేకర్స్ ని తిట్టేసారు. అభిమానం ఉండొచ్చు మరీ ఇంత ఉండకూడదు. పెద్ద బ్యానర్లు కి ఆయా అప్ డేట్స్ కోసం రిక్వెస్ట్ చెయ్యొచ్చు.. కానీ ఇలాంటి తిట్లతో కాదు.

కనీసం హీరోలైనా అభిమానులకు కాస్త దిశా నిర్దేశకాలు చేస్తే బావుంటుంది. లేదంటే ఇలానే ఫాన్స్ రెచ్చిపోతారు.

Fans crossing limits:

<span>Fans calling out movie banner for updates</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs