Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 5: ప్రియాంకని హార్ట్ చేసిన మానస్


బిగ్ బాస్ సీజన్ 5 మొదలైంది మొదలు ఉమాదేవి.. ఆ వయసులో కంటెంట్ కొసం లోబోతో లవ్ ట్రాక్ నడిపినట్టుగా క్రియేట్ చేస్తే.. హమీద - శ్రీరామ్ లు అదే విధంగా ట్రాక్ నడిపించారు. హమీద ఎలిమినేట్ అవ్వగానే.. శ్రీరామ్ డల్ అయ్యాడు. ఇక ప్రియాంక ఎప్పుడూ మానస్ చుట్టూ తిరుగుతూ మానస్ కి సేవలు చేస్తూ.. అతనిపై ప్రేమ కురిపిస్తూనే పన్నెండు వారాలు హౌస్ లో నెట్టుకొచ్చేసింది. కేవలం మానస్ ట్రాక్ తోనే ప్రియాంక ఇన్ని రోజులు హౌస్ లో నిలబడగలిగింది. ఇక షణ్ముఖ్ - సిరి లు వేరే లెవల్ అన్నట్టుగా ఉన్నారు. హగ్ లు, కిస్ లు లవర్స్ కూడా ఇలాంటి పనులు చెయ్యరు అనే విధంగా రెచ్చిపోయి బిగ్ బాస్ కి కంటెంట్ ఇచ్చేసారు.

Advertisement
CJ Advs

ఇక నాగార్జున మానస్ ని పిలిచి ప్రియాంక నిన్ను ఫ్రెండ్ గా అనుకోవడం లేదు.. అంటూ ఓ వీడియో చూపించగానే జ్ఞానోదయమైన మానస్ ప్రియాంకని పక్కనబెట్టేసాడు. ఆమె ఏం చేసినా మానస్ తీసుకోవడం లేదు. మానస్ కూడా ప్రియాంక తో తన ట్రాక్ బయట బాగా వెళుతుంది అనుకుని.. ప్రియాంకని ఎంకరేజ్ చేసాడు కానీ.. అందులో ప్రియాంక తప్పు లేదు. కానీ మానస్ ఉన్నట్టుండి నాగ్ చెప్పగానే ప్రియాంకని దూరం పెట్టేసరికి షణ్ముఖ్, సిరులు ప్రియాంకకి హిత బోధ చెయ్యడంతో ఈ వారం నామినేషన్స్ అప్పుడు ప్రియాంక బాగా తడబడింది. నామినేషన్స్ ప్రక్రియ ముగిసాక మానస్ ప్రియాంక తో నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకో పింకీ అంటూ వెళ్లిపోతుంటే.. నువ్ చెప్పావ్ వెళ్ళిపోతున్నావ్ నేను చెప్పేది వినవా అని అడిగింది.

నేను చెప్పాల్సింది చెప్పాను.. నేను వినను అనగానే ప్రియాంక కోపంగా మానస్ కి దణ్ణం పెట్టేసింది. ఇక లోపల కిచెన్ లోనూ మానస్ - ప్రియాంక మధ్యన డిస్కర్షన్ జరిగింది. ఇక అనాల్సిన మాటలు అనేసి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు అని మానస్ అనగా.. అవును నువ్ అంటే నేను బాధపడతాను అంది ప్రియాంక.. అలా ఎందుకు అని మానస్ అనగా.. దానికి ప్రియాంక నాకు ఒళ్లు కొవ్వు అనేసింది. నాకు నచ్చడం లేదు అని చెబుతుంటే అని మానస్ అన్నాడు. ఏం నచ్చడం లేదు అని ప్రియాంక అడిగింది.. నాకసలు నువ్ నచ్చడం లేదు అని మానస్ అన్నాడు. దానితో ప్రియాంక బాగా హార్ట్ అయినట్లుగా ప్రోమోలో చూపించారు.

Bigg Boss 5: Manas hurting comments on Priyanka:

Bigg Boss 5 Telugu: Today promo highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs