Advertisement
Google Ads BL

ఎవరేమనుకుంటే నాకేంటి: బ్రహ్మానందం


ఒక్కప్పుడు సినిమాల్లో కమెడియన్ బ్రహ్మానందం లేకుండా సినిమానే ఉండేది కాను.. కానీ ఈమధ్యన బ్రహ్మానందం ని టాలీవుడ్ పూర్తిగా పక్కనబెట్టేసింది.. కొత్త కమెడియన్స్ రాకతో బ్రహ్మి హవా బాగా తగ్గింది. తాజాగా అలీ తో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చిన బ్రహ్మి.. షో ఎంట్రీ అదిరిపోయే లెవల్లో ప్లాన్ చేసారు నిర్వాహకులు.. ఇక అలీ తో బహ్మానందం తన పుట్టు పూర్వోత్తరాలు దగ్గర నుండి.. ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారో అనే విషయాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా బ్రహ్మానందం కి పొగరెక్కువ, ఆయన ఆరు దాటితే షూటింగ్ చెయ్యరు, మధ్యాన్నం రెండు గంటల రెస్ట్, పొద్దున్నే తొమ్మిది గంటలైతే తప్ప సెట్స్ కి రారు అనేవారు, ఆ విషయానికి బ్రహ్మనందం ఓపెన్ గానే సమాధానం చెప్పారు.

Advertisement
CJ Advs

అలీ అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను  సినిమాల్లోకి వచ్చాక 35ఏళ్ల పాటు నిర్విరామంగా పని చేసి అలిసిపోయాను. రోజుకు మూడు, నాలుగు షిఫ్ట్‌లు పనిచేశా. ఒక్క రోజూ మూడు రాష్ట్రాల్లో తిరిగేవాడిని. ఉదయం వైజాగ్ లో ఉంటే.. మధ్యాన్నం చెన్నై లో పెళ్లి సందడి సాంగ్ షూట్ లో.. సాయంత్రం బెంగుళూర్ షూట్, ఇలా తిని, తినక తిప్పలు పడి, తిన్నది అరగక వాంతులు అయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కొన్నా. ఇంతకాలం శరీరం కష్టపడిన తర్వాత దానికి కూడా విశ్రాంతినివ్వాలి కదా, డబ్బులు వస్తున్నాయి కదాని షూటింగ్‌లు చేయకూడదు. 

మనకు భగవంతుడు ప్రాణంతో పాటు శరీరం కూడా ఇచ్చాడు. దాన్ని కాపాడుకోవాలి. అందుకే నేను ఈ సమయానికి వస్తా. ఇప్పటివరకే పనిచేస్తా. ఇష్టమైతే పెట్టుకోండి. లేకపోతే లేదు అని నన్ను నేను తగ్గించుకున్నా. నా సినిమాలు తగ్గించుకున్నా అని, అందుకే తనకి అవకాశాలు తగ్గాయని బ్రహ్మానంద అలీ షో లో చెప్పారు. 

Ali Tho Saradaga Brahmanandam Episode Highlights:

Ali Tho Saradaga Brahmanandam show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs