కరోనా క్రైసిస్ పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలకు గడ్డు కాలమే. ఇక జులై లో సెకండ్ వేవ్ కొలిక్కి రావడంతో.. థియేటర్స్ ఓపెన్ అయినా.. పెద్ద సినిమాలేవీ ధైర్యంగా బరిలోకి దిగలేదు.. కేవలం చిన్న, మీడియం సినిమాలు మాత్రమే థియేటర్స్ దగ్గర సందడి చేసాయి. ఇక డిసెంబర్ స్టార్టింగ్ తోనే పెద్ద సినిమా ల టైం స్టార్ట్ అయ్యింది. అఖండ బాక్సాఫీసుని షేక్ చెయ్యడానికి రెడీ అయ్యింది.. ఇక అఖండ తో పెద్ద సినిమా జాతర మొదలు కాబోతుంది. డిసెంబర్ 2 న అఖండ వస్తుంటే.. 17 న అల్లు అర్జు పుష్ప వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మర్కెట్ లోకి దిగుతుంది. ఇక తర్వాత నాని శ్యామ్ సింగరాయ్, మధ్యలో బాలీవుడ్ మూవీస్ జాతర కూడా ఉండనే ఉంది. ఇక జనవరిలో మహా సంగ్రామమే.. జనవరి 7 న ఆర్.ఆర్.ఆర్ మూవీ, జనవరి 12 న పవన్ భీమ్లా నాయక్, 14 న ప్రభాస్ రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ తో బాక్సాఫీసు దడదడే.
ఇక ఈ పెద్ద సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియా షేక్ అనేలా ఉంది. ప్రభాస్ రాధేశ్యామ్ నుండి సాంగ్ అప్ డేట్, ట్రైలర్ అప్ డేట్ అంటూ ఫాన్స్ హంగామా, పుష్ప నుండి సాంగ్స్, ట్రైలర్ అప్ డేట్స్, ప్రస్తుతం అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్, అల్లు అర్జున్ గెస్ట్, అలాగే బాలయ్య ఇంటర్వూస్, ఇంకా ఆర్.ఆర్.ఆర్ సాంగ్స్ అప్ డేట్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్, అలాగే పవన్ భీమ్లా నాయక్ అప్ డేట్స్ తో ఫాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చతో ఈ రెండు నెలలు సోషల్ మీడియా దే హవా లా కనబడుతుంది. పేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఇలా రోజుకి నాలుగైదు పెద్ద సినిమాల అప్ డేట్స్ తో చేసే హడావిడి తో సోషల్ మీడియా కళకళలాడుతుంది.