Advertisement
Google Ads BL

భీమ్లా నాయక్ బ్లాస్ట్ కి రెడీ


సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియా కళకళలాడుతుంది. ఇక ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ ల హడావిడి జోరులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అప్ డేట్స్ కాస్త లేట్ అయ్యేసరికి.. పవన్ ని రిక్వెస్ట్ చేసి రాజమౌళి భీమ్లా నాయక్ ని ఆర్.ఆర్.ఆర్ తో పోటీ నుండి తప్పించారేమో.. భీమ్లా నాయక్ మేకర్స్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నారేమో అనే అనుమానాలు రేజ్ అయ్యాయి. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ భీమ్లా నాయక్ మేకర్స్ ఎప్పటికప్పుడు సంక్రాంతి నే టార్గెట్ చేస్తున్నామని చెబుతున్నారు. ఇక ఈ రోజు సంక్రాంతి బరిలో ఉన్న ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ అప్ డేట్స్ తో ప్రభాస్ ఫాన్స్, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక భీమ్లా నాయక్ అప్ డేట్ కోసం పవన్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. అనుకోకుండా భీమ్లా నాయక్ అప్ డేట్ కూడా రానే వచ్చేసింది. నిర్మాత నాగ వంశీ భీమ్లా నాయక్ బ్లాస్ట్ టుమారో ఉదయం అడవి తల్లి మాట... #BheemlaNayak  Update Tomorrow Morning! 🔥 అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చెయ్యడంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ అలెర్ట్ అయ్యారు. రేపు ఉదయం రాబోయే భీమ్లా నాయక్ సాంగ్ కోసం ఇప్పటి నుండే పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. రానా, నిత్యా మీనన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

Bheemla Nayak Adavi Talli Maata tomorrow:

Pawan Kalyan Bheemla Nayak Adavi Talli Maata tomorrow morning
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs