Advertisement
Google Ads BL

నా ఎలిమినేషన్ లో తప్పు జరిగింది: రవి


బిగ్ బాస్ సీజన్ 5 లో 12 వ వారంలో 12 వ కంటెస్టెంట్ గా యాంకర్ రవి ఎలిమినేట్ అవడం అందరికి షాకింగ్ గా ఉండడమే కాదు.. ఆఖరికి యాంకర్ రవి కూడా షాక్ అవుతున్నాడు. అయితే రవి ఎలిమినేషన్ పారదర్శకంగా జరగలేదు అని, రవి ఎలిమినేట్ అవ్వాల్సింది కాదు, బిగ్ బాస్ హౌస్ లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది అంటూ రవి ఫాన్స్ కొంతమంది అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట ఆందోళన చెయ్యడం కలకలం రేపింది. అయితే తాజాగా యాంకర్ రవి అభిమానులతో మాట్లాడుతూ.. తనకి కాజల్ కన్నా తక్కువ ఓట్స్ వచ్చాయనేది నిజం కాదని, ఏం జరిగిందో అనేది తనకి తెలియడం లేదు అని, నా ఎలిమినేషన్ విషయంలో తప్పు జరిగింది అని నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్, ఫాన్స్ అనుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఎక్కడో తప్పు జరిగింది అని భావిస్తున్నారు. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాకా తన చుట్టూ ఇంతమంది ఉన్నారనే ఫీలింగ్ ధైర్యాన్ని ఇచ్చింది అని, తన ఎలిమినేషన్ ఎందుకు జరిగిందో అర్ధం కావడం లేదు అని, తాను హౌస్ లో బాగా పెర్ఫర్మెన్స్ ఇచ్చాను, కానీ బయటకి కంటెంట్ ఏం వచ్చిందోయ్ తెలియదు.. తాను కంటెంట్ చూసిన తర్వాతే అంతా మాట్లాడతాను.. మీ ప్రేమ అభిమానం చూసాక నేనే విన్నర్ అని ఫీల్ అవుతున్నాను. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా బాధగా ఉంది. మీ అభిమానం చూసిన తర్వాత నేను గెలిచానని అనుకొంటున్నాను. లోబో, విశ్వ వెళ్ళిపోయాక నేను ఒంటరివాడినయ్యాను.. కానీ మీ అందరి సహకారంతో ముందుకు వెళతాను అంటూ రవి కాస్త ఎమోషనల్ అయ్యాడు. 

Anchor Ravi Shocking Comments On Bigg Boss Eliminations:

Anchor Ravi Shocking Comments On Eliminations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs