Advertisement
Google Ads BL

డిసెంబర్ 6 ఫాన్స్ కి పూనకాలే..


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో క్రేజీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన పుష్ప మూవీ డిసెంబర్ 17 న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పుష్ప రాజ్ హవా సోషల్ మీడియాలో నడుస్తుంది. అల్లు అర్జున్ ఫాన్స్ పుష్ప అప్ డేట్స్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 2 న అఖండ మూవీ రిలీజ్ రోజునే ఆ థియేటర్స్ లో పుష్ప మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది అంటూ ప్రచారం జరిగినా.. పుష్ప ట్రైలర్ ని డిసెంబర్ 6 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చేసారు. ఐదు భాషల్లో పుష్ప ట్రైలర్ రిలీజ్ అంటూ పోస్టర్స్ తో సహా ప్రకటించారు. పుష్ప టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసి.. యూట్యూబ్ రికార్డ్స్ కొల్లగొట్టారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు మరోసారి పుష్ప ట్రైలర్ తో ఆ అంచనాలు మరింతగా పెంచబోతున్నారు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా, రష్మిక శ్రీవల్లి గా పుష్ప సాంగ్స్ తోనే హైప్ క్రియేట్ చేసారు. ఇక అనసూయ దాక్షాయణి లుక్, విలన్ ఫహద్ ఫాసిల్ లుక్, సునీల్ లుక్ అన్ని ఫాన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసాయి. ఇక ఇప్పడు ట్రైలర్ లో ఏం చూపించబోతున్నారా అనే ఆసక్తి  అల్లు అర్జున్ ఫాన్స్ లో అంతకంతకు ఎక్కువైపోతోంది. డిసెంబర్ 6 న అల్లు అర్జున్ కి పూనకాలే అనేలా పుష్ప ట్రైలర్ పై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోతున్నాయి. 

Pushpa The Rise theatrical trailer to be released on:

Pushpa The Rise theatrical trailer wildest festival on
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs