ప్రముఖ డాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్ కొద్దిసేపటి క్రితం(ఆదివారం రాత్రి 8 గంటలకి) గచ్చిబౌలి లోని ఏఐజీ ఆసుపత్రిలో కరోనా తో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు విజయ్, అజయ్ ఉన్నారు. గత వారం కరోనా బారిన పడిన శివశంకర్ మాస్టర్ హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు 75 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిని పరిస్థితి విషమించింది. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు, ఆయన భార్యకి కూడా కూడా కరోనా సోకింది. పెద్ద కుమారుడు కూడా క్రిటికల్ కండిషన్ లోనే ఏఐజీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. భార్య మాత్రం హోమ్ ఐసోలేషన్ లోనే కరోనా చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం క్రిటికల్ గా ఉండడంతో.. రోజుకి సుమారు లక్ష రూపాయల ఖర్చు అవ్వడంతో.. టాలీవుడ్ ప్రముఖులు చాలామంది శివ శంకర్ కుటుంబానికి అండగా నిలిచారు.
మెగాస్టార్ చిరు.. శివ శంకర్ కుటుంబానికి మూడు లక్షల తక్షణ సహాయం చెయ్యడమేగా కాదు.. తమిళ హీరో ధనుష్ కూడా ఆయన ఫ్యామిలీకి ఆర్ధిక సహాయం చేసారు. టాలీవుడ్ మొత్తం ఆయన ఫ్యామిలికి అండగా ఉంటుంది అని ప్రకటించారు. కానీ ఎవరి సహాయం శివ శంకర్ మాస్టర్ ని కాపాడలేకపోయాయి.10 భాషల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు శివశంకర్ మాస్టర్. వీటిలో తెలుగు, తమిళం వంటి దక్షిణాది సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో రాజమౌళి, రామ్ చరణ్ మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శివశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ దక్కింది. బాహుబలి చిత్రానికి కూడా శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. టెలివిజన్ రంగంలో ఆట జూనియర్స్, ఢీ వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించి యువ డాన్సర్లకు విలువైన సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన మృతి నృత్య కళా రంగానికి తీరని లోటు. శివ శంకర్ మాస్టర్ మరణ వార్తతో టాలీవుడ్ షాకయ్యింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.