Advertisement
Google Ads BL

ఆచార్య సిద్ధ టీజర్: ధర్మస్థలికి ఆపదొస్తే..


చిరంజీవి - రామ్ చరణ్ కాంబోలో కొరటాల శివ దర్శత్వంలో క్రేజీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఆచార్య మూవీ ఫిబ్రవరి 4న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇంకా రెండు నెలల టైం ఉన్న ఆచార్య రిలీజ్ కి.. ఇప్పటి నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. ఇప్పటికే చిరు ఆచార్య టీజర్, చిరు పై సాంగ్ రిలీజ్ చేసిన టీం ఈమధ్యనే రామ్ చరణ్ - పూజ హెగ్డే ల పై చిత్రీకరించిన నీలాంబరి సాంగ్ రిలీజ్ చేసారు. ఇక నేడు ఆదివారం ఆచార్య లో సిద్ద గా కనిపించబోతున్న రామ్ చరణ్ టీజర్ ని రిలీజ్ చేసింది టీం. మెడలో రుద్రాక్ష, నుదుటిన బొట్టు, డిఫ్రెంట్ డ్రెస్సింగ్ స్టయిల్ తో నీలాంబరి సాంగ్ లోనే అదరగొట్టేసిన రామ్ చరణ్ సిద్డగా ఆచార్య టీజర్ లో చాలా అందంగా, మాస్ గా కనిపించాడు. పూజ హెగ్డే తో రొమాన్స్, అలాగే రౌడీల భారతం పట్టే యాక్షన్ సన్నివేశాలు, రామ్ చరణ్ లుక్ అన్ని ఈ టీజర్ కె హైలైట్స్ గా ఉన్నాయి.

Advertisement
CJ Advs

ధర్మస్థలికి ఆపదొస్తే.. అది చేయించడానికి.. అమ్మోరు తల్లి మరొకరిని ఆవహించి అంటూ రామ్ చరణ్ డైలాగ్ చెప్పిన తీరు, సిద్ద పరిగెడుతున్న సీన్, కట్ చేస్తే ఫారెస్ట్ లో సిద్ద రన్నింగ్ చేస్తూ శత్రువులని మట్టు బెట్టే సీన్స్ హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక సోను సూద్ తో సిద్ద తలపడిన తీరు కూడా అద్భుతః అనేలా ఉంది. టీజర్ చివరిలో.. పులి దాని పిల్ల తో నీటిమడుగు దగ్గర చూపించి వెంటనే అక్కడ ఆచార్య గా చిరు, సిద్ద గా రామ్ చరణ్ లని చూపించడం చూస్తే.. తండ్రీకొడుకులు పులులా వేటాడతారనిపించేలా ఉంది ఆ సీన్. ఇక టీజర్ లో చిరు ని చూపించేసి మెగా ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు కొరటాల. కొరటాల మేకింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, రామ్ చరణ్ లుక్స్, ధర్మస్థలి సెట్, పూజ హెగ్డే తో చరణ్ రొమాంటిక్ సీన్స్ అన్ని టీజర్ కి హైలెట్ అనేలా ఉన్నాయి.

Acharya Siddha Saga Teaser out now:

Ram Charan Acharya Siddha Saga Teaser out now
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs