Advertisement
Google Ads BL

సుధీర్ జబర్దస్త్ వదలడం లేదు


ఈమధ్యన అంటే ఓ నెల రోజులుగా జబర్దస్త్ సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ని వదిలెయ్యబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈటీవీలో ఢీ డాన్స్ షో, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ హోస్ట్ గా చేస్తున్న సుధీర్ జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటినుండి జబర్దస్త్ లో తన స్కిట్స్ తో అందరిని మెప్పిస్తున్నాడు. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, సుధీర్ లు కలిసి కామెడీ పరంగా ఆకట్టుకుంటున్నారు. ఇక సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్న ఎన్నడూ జబర్దస్త్ కి గ్యాప్ ఇవ్వలేదు. ఒకటో రెండో స్కిట్స్ కి మిస్ అయినా.. మళ్ళీ జబర్దస్త్ లోనే తేలేవాడు. ఇక జబర్దస్త్ వదిలి సినిమాలవైపు వెళ్ళినవారు అక్కడ సక్సెస్ అవలేదు.. అలాగే మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ కూడా ఇవ్వలేకపోయారు. అందుకే సుధీర్ ఎప్పుడూ జబర్దస్ కి బ్రేక్ ఇవ్వకుండా వెండితెర మీద అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఈమధ్యన సుధీర్ జబర్దస్త్ కి మల్లెమాల వాళ్ళకి అగ్రిమెంట్ చెయ్యలేదు.. సో జబర్దస్త్ ని వదిలేస్తున్నాడనే న్యూస్ నడిచింది. తాజాగా ఈ న్యూస్ పై గెటప్ శ్రీను స్పందిస్తూ సుధీర్ జబర్దస్త్ ని వదలడం లేదు.. కాస్త గ్యాప్ తీసుకుంటున్నాడు తప్ప.. అని సుధీర్ పై క్లారిటీ ఇచ్చాడు. సుధీర్ హీరోగా రెండు సినిమాల షూటింగ్ తో కాస్త బిజీ అవ్వడమే కాక షూటింగ్ ఒత్తిడితో కాస్త డిప్రెషన్ లోకి వెళుతుండడంతో సుధీర్ జబర్దస్త్ కి కొద్దిగా బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు తప్ప జబర్దస్త్ ని వదలడం లేదు అంటూ ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసాడు.

Sudhir is not leaving Jabardasth:

Getup Srinu gave clarity on Sudheer will leave Extra Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs