ప్రభాస్ రాధేశ్యామ్ పనులని చక్కబెట్టేసి.. ముంబై వెళ్లి అక్కడ ఓం రౌత్ తో కలిసి 3D మూవీ ఆదిపురుష్ షూటింగ్ కూడా ముగించేసి అందరికి షాక్ ఇచ్చేసాడు. ఆదిపురుష్ ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ తో కూడుకున్న సినిమా కావడంతో.. ప్రభాస్ చాలా స్పీడు గా ఆదిపురుష్ ప్రాజెక్ట్ నుండి బయట పడ్డాడు. ఇక ప్రస్తుతం సలార్ షూటింగ్ కి రెడీ అయిన ప్రభాస్ నాగ్ అశ్విన్ తో చెయ్యబోయే ప్రాజెక్ట్ కే ని సలార్ షూటింగ్ పూర్తి చేశాకే.. రెగ్యులర్ షూట్ కి వెళతాడనికి అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే ని అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి.. ట్రయిల్ షూట్ కూడా నిర్వహించారు.
ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే రెగ్యులర్ షూట్ ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ప్రాజెక్ట్ కే రెగ్యులర్ షూట్ కి ముహూర్తం, ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 2 నుండి నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే మొదలు పెట్టబోతున్నాడని.. ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూట్ లో పాల్గొనేందుకు రెడీ అయ్యారని తెలుస్తుంది. అమితాబచ్చన్, దీపికా పదుకొనే లాంటి బాలీవూడ్ స్టార్స్ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 2 నుండి ప్రాజెక్ట్ కే ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెడతారని, ప్రాజెక్ట్ కే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక ప్రభాస్ సలార్ ని పూర్తిగా కంప్లీట్ చేసి.. మళ్ళీ ప్రాజెక్ట్ కే మీదకి వస్తాడని టాక్.