Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ కి డబుల్ సర్ ప్రైజ్


బిగ్ బాస్ బాస్ సీజన్ 5 లో ప్రస్తుతం ఇంటి సభ్యుల రాకతో హౌస్ మొత్తం ఎమోషనల్ గా మారిపోయింది. సిరి తల్లి వచ్చి షణ్ముఖ్ ని కడిగిపారేసింది. దానితో షణ్ముఖ్ హార్ట్. మానస్ ప్రియాంక ని హార్ట్ చేసాడు. ఇక సన్నీ మదర్ వచ్చారు. రవి భార్య పాప రాగా.. పాప వెళ్ళేటప్పుడు ఏడవడం అందరిని కలిచి వేసింది. ఇక షణ్ముఖ్ కోసం ఎవరు వస్తారో.. అనుకున్నారు. అంటే అందరూ షణ్ముఖ్ కోసం గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన వస్తుంది అంటూ ప్రచారం జరిగినా.. ప్రస్తుతం హౌస్ లోకి షణ్ముఖ్ మదర్ అడుగుపెట్టారు. ఇక ప్రియాంక సిస్టర్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది.

Advertisement
CJ Advs

అయితే తల్లి ఎంట్రీ ఇవ్వగానే.. హాయ్ షన్ను బాబు అంటూ షణ్ముఖ్ దగ్గరకి వచ్చి ముద్దుపెట్టుకుంది, తల్లికి కెప్టెన్సీ బ్యాండ్ పెట్టి హగ్ చేసుకున్నాడు. దానితో ఆమె షన్ను నీ మోజ్ రూమ్ చూడాలి నేను అంటూ తీసుకు వెళ్ళింది. షణ్ముఖ్ తల్లితో మట్లాడుతూ.. ఉండగా సిరి వచ్చింది.. రామ్మా శిరీష అంటూ ఆటపట్టించారు. హాయ్ ఆంటీ.. ఏమిటి కబుర్లు అంటూ సిరి పలకరించింది. దానికి ఆవిడ గేమ్ ని గేమ్ లా చూడండి ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి అంది.. దానితో సిరి కాస్త ఫీలైనట్లుగా ప్రోమో లో చూపించారు.

నీకేది ఇష్టం.. నాతో ఎవరు మంచి బాండ్ అని అడిగాడు తల్లిని.. రవినా, సిరినా అనగా.. అందరితో ఉంది అంది.. ఇక షణ్ముఖ్ అమ్మా దీపుని కలిసావా అనగానే కలిసాను అంది.. దానితో  షణ్ముఖ్ అబద్దం చెప్పకమ్మా అనగా.. అమ్మ అబద్దం చెబుతుందా అంది ఆవిడ.. చెబుతావ్ అమ్మా నెక్స్ట్ త్రీ వీక్స్ హౌస్ లో ఉండాలి అంటే.. నువ్వు చెబుతావ్ అన్నాడు. ఇక రవి కూతురు బిగ్ బాస్ హౌస్ లో కలియతిరుగుతూ వేర్ ఈజ్ బిగ్ బాస్ అంకుల్ అని అడుగుతూ వాష్ రూమ్స్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ బిగ్ బాస్ ఉంటాడని చెప్పినా.. నేను బిగ్ బాస్ అంకుల్ చూడాలి అంటూ మారాం చేసిన ప్రోమో వైరల్ గా మారింది.

Bigg Boss 5: Double Surprise for Shanmukh Jaswanth:

Bigg Boss 5 Telugu: Latest promo viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs