పుష్ప పాన్ ఇండియా ఫిలిం తో అంచనాలు లేపి.. డిసెంబర్ 17 న వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో పుష్ప ని దింపుతున్న అల్లు అర్జున్.. పుష్ప ప్రమోషన్స్ ని భారీ లెవల్లో ప్లాన్ చేసారు. సుకుమార్ - అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ ని దుబాయ్ వేదికగా రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్ధం చేసేసారు. ఇప్పటికే పుష్ప సాంగ్స్ తో మర్కెట్ ని ఊపేస్తున్న అల్లు అర్జున్.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతూ అందరికి షాక్ ఇచ్చాడు. పుష్ప రాజ్ గా బన్నీ అక్కడ నందమూరి ఫాన్స్ హార్ట్ టచ్ చేసాడు.
ఇక తాజాగా అల్లు అర్జున్.. గత పదేళ్లుగా ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి ప్రసారం అవుతున్న అతిపెద్ద డ్యాన్స్ రియాల్టీ షో ఢీ సీజన్ 13 కి ముఖ్య అతిధిగా రాబోతున్నాడు. ఢీ సీజన్ 13 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి అల్లు అర్జున్ వచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఢీ డాన్స్ గ్రాండ్ ఫినాలే కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది. పుష్ప సినిమాలోని ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా అనే పాటతో అల్లు అర్జున్ ఢీ స్టేజ్ పైకి సూపర్ ఎంట్రీ ఇచ్చాడు. గతంలో ఆర్య టైం లోను అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ ఢీ షో కి గెస్ట్ గా వచ్చారు. ఇక ఇప్పుడు పుష్ప రిలీజ్ టైం లో అల్లు అర్జున్ ఇలా ఢీ డాన్స్ షో కి రావడం తో మెగా ఫాన్స్ తెగ ఖుషి అయ్యిపోతున్నారు. మరి అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ టైం లో టు అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇటు ఢీ డాన్స్ షో కి గెస్ట్ గా వచ్చి పుష్ప సినిమాని అదిరిపోయే లెవల్లో ప్రమోట్ చేసేస్తున్నాడు.