Advertisement
Google Ads BL

నారా భువనేశ్వరి ఫస్ట్ రియాక్షన్


ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భార్య, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి మొదటి సారి ఓ లేఖ తో స్పందించారు. తనపై అనుచిత వ్యాఖ్యల చేసిన వారి పట్ల నిరసన వ్యక్తం చేసిన వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. ఆ లేఖ ద్వారా భువనేశ్వరి తనకి సపోర్ట్ గా నిలిచిన వారందరికీ పేరు పేరునా.. కృతజ్ఞతలు తెలియజేసారు.

Advertisement
CJ Advs

ఆ లేఖలో లో భువనేశ్వరి స్పందిస్తూ.. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మానాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ రాసుకోచ్చాహ్రూ.. తనపై అజరిగిన అవమానం విషయంలో భువనేశ్వరి ఫస్ట్ టైం ఈ లేఖ ద్వారా రియాక్ట్ అయ్యారు.

Nara Bhuvaneswari First Reaction:

Nara Bhuvaneswari Reacts On AP Assembly Incident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs