నిన్నరాత్రి బిగ్ బాస్ హౌస్ లో జరిగిన పరిణామాలు.. ఒక్కసారిగా వేడెక్కాయి.. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ అంతా ఎమోషనల్ గా అయ్యిపోయింది. మానస్ తల్లి రాక ఉల్లాసంగా గడవగా.. సిరి తల్లి రాక ఎమోషనల్ అయ్యింది. సిరి తల్లి పదే పదే షణ్ముఖ్ - సిరి ల హగ్స్ నచ్చలేదని, ఓ తండ్రిగా, అన్నగా, ఫ్రెండ్ గా అంటూ అనడంతో షణ్ముఖ్ బాగా హార్ట్ అయ్యాడు. ఆమె వెళ్ళిపోగానే. షణ్ముఖ్ ఫీలయ్యాడు. ఆవిడ అంటున్నప్పుడు నేను ఎందుకు ఖండించలేదు.. ఒక మదర్ గా ఆమె బాధ అర్ధమవుతుంది.. కానీ నేను ఏం చెయ్యను బిగ్ బాస్ నా ఫ్యామిలీని కూడా పంపండి అంటూ చిన్నపిల్లాడిలా మారిపోయాడు షన్ను. ఇక సిరి కూడా షణ్ముఖ్ తన తల్లి మాటలకు ఎక్కడ బాధపడతాడో అనే టెంక్షన్ లోనే ఉంది.. తల్లికి చెప్పింది నువ్ అలా అన్నావ్ అలా అనకూడదు అంటూ.. తల్లి వెళ్ళాక సిరి షణ్ముఖ్ ని పట్టుకుని ఏడ్చినా షణ్ముఖ్ మాత్రం భయపడ్డాడు ఆమెని హాగ్ చేసుకోవడానికి. ఇక తర్వాత సిరి కూడా ఏడ్చేసింది.
ఇక మానస్ తల్లి వెళ్ళగానే ప్రియాంక మానస్ దగ్గరకి వచ్చి.. మానస్ మూడు వారాలుగా నువ్ నాతో సరిగ్గా ఉండడం లేదు.. కాజల్ తో బావుంటున్నావ్ కానీ నాతొ సరిగ్గా మాట్లాడడం లేదు.. అనగానే మానస్ కూడా అవును నాకు నచ్చలేదు అంటే వినవు.. ఫ్రెండ్లీగా మాట్లాడతాను.. నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావ్ అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నీతో మామూలుగానే ఉండాలని అనుకుంటాను.. కానీ నువ్వు ఏదేదో ఊహించుకుని ఫీలవుతావు.. నేను ఇదే చెప్పాలని అనుకుంటున్నా అంటూ ప్రియాంకకి ఫుల్ గా మానస్ క్లారిటీ ఇవ్వడంతో.. ప్రియాంక సరే అంటూ వెళ్ళిపోయింది. సో గత రాత్రి ఎపిసోడ్ హై లైట్స్ ఇవి.