మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని మూవీ అసలైతే డిసెంబర్ 3న అంటూ ఎప్పుడో రిలీజ్ డేట్ ఇచ్చారు. అయితే అదే టైం కి బాలకృష్ణ అఖండ రిలీజ్ డేట్ రావడంతో.. వరుణ్ తేజ్ సైలెంట్ గా డిసెంబర్ 24 క్కి వెళ్ళిపోయి.. నాని కి పోటీగా నిలబడ్డాడు. క్రిష్టమస్ బరిలో నాని శ్యామ్ సింగరాయ్ ఉంది.. అయినా వరుణ్ తేజ్ అదే డేట్ ని ఖరారు చేసి గని గ్లిమ్ప్స్ అంటూ హడావిడి చేసాడు. మరి నాని శ్యామ్ సింగరాయ్ మూవీ డిసెంబర్ 24 టార్గెట్ గా ప్రమోషన్స్ హడావుడితో.. రోజుకో అప్ డేట్ ఇస్తూ.. అదరగొట్టేస్తున్నారు. కానీ వరుణ్ తేజ్ గని గ్లిమ్ప్స్ దగ్గరే ఆగిపోయాడు.
గని నుండి ఓ సాంగ్ కానీ, ఓ టీజర్ కానీ ఎలాంటి అప్ డేట్ రాకపోయేసరికి వరుణ్ తేజ్ గని మూవీ ని మళ్ళీ పోస్ట్ పోనే చేస్తున్నాడనే న్యూస్ మొదలైపోయింది. డిసెంబర్ 24 నుండి వరుణ్ తేజ్ వెనక్కి తగ్గుతున్నాడని, నాని కి అలాగే ఇంకా బాలీవుడ్ మూవీస్ కి పోటీ ఎందుకు అని వరుణ్ అండ్ గని టీం భావించబట్టే.. ఇలా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారని అంటున్నారు. కానీ సైలెన్స్ బ్రేక్ చేసి.. గని కొత్త డేట్ అయినా ఇవ్వొచ్చు కదా అని అంటున్నారు కొందరు. లేదంటే డిసెంబర్ 24 నే రిలీజ్ అనుకుంటే.. ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యండి మహా ప్రభో అంటూ వరుణ్ కి మెగా ఫాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు.