Advertisement
Google Ads BL

సర్ ప్రైజ్: అఖండ ఈవెంట్ కి పుష్ప రాజ్


బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖండ మూవీ పై ట్రేడ్ లోనే కాదు.. మాస్ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. అఘోర గా బాలయ్య పెరఫార్మెన్స్ కోసం ఆడియన్స్ అంతా వెయిటింగ్ అనేలా బాలయ్య అఘోర కేరెక్టర్ ఉంది. బోయపాటి మాస్ మేకింగ్ స్టయిల్, బాలయ్య ఎనర్జిటిక్ యాక్టింగ్, శ్రీకాంత్ విలనిజం, థమన్ మ్యూజిక్ అన్ని హైలెట్ అనేలా ఉన్న అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరగబోతుంది, అలాగే బాలయ్య ఆహ్వానం మేరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఎన్టీఆర్ తో పాటుగా నేచురల్ స్టార్ నాని కూడా రాబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. కానీ ఎన్టీఆర్ పారిస్ వెళ్ళాడు, అలాగే బాలకృష్ణ చేతికి ఆపరేషన్ జరగడంతో అఖండ ఈవెంట్ ని సింపుల్ గా చేస్తున్నారనగానే నందమూరి ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు.

Advertisement
CJ Advs

అయితే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ అదిరిపోయే లెవల్లో నవంబర్ 27న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జరగబోతుంది. ఈ ఈవెంట్ కి ఊహించని గెస్ట్ రాబోతున్నాడు. అతనే పుష్ప రాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మధ్యనే ఆహా ఓటిటి కోసం మెగా కాంపౌండ్ లోకి బాలయ్య అన్ స్టాపబుల్ అంటూ అడుగుపెట్టడం, అటు బోయపాటి తో అల్లు అర్జున్ కి ఉన్న తత్సంబంధం వలన అల్లు అర్జున్ ఈ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతున్నాడని తెలుస్తుంది. అందులోనూ అఖండ తర్వాత బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా చెయ్యబోతున్నాడనే న్యూస్ ఉండగా.. అల్లు అర్జున్ ఇలా బాలయ్య అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మెగా, నందమూరి కలయికలో అఖండ ఈవెంట్ అనగానే ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

Allu Arjun To Attend Akhanda Pre-release Event As Chief Guest:

Icon Star Allu Arjun To Attend Nandamuri Balakrishna Akhanda Pre-release Event As Chief Guest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs