యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొడాలి నాని ఎంతమంచి స్నేహితులో గతంలో వాళ్ళు కలిసి వెళ్లిన ఈవెంట్స్, వాళ్ళు కలిసి ఉన్న మూమెంట్స్ చూస్తే తెలుస్తుంది. హరికృష్ణ కుటుంబానికి కొడాలి నానికి అనుబంధం ఉండేది. ఇక పొలిటికల్ గా కొడాలి నాని వైసిపిలోకి చేరాక టీడీపీని, చంద్రబాబు ని అనరాని మాటలంటూ బూతు మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. కొడాలి పార్టీ మారాక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కాస్త దూరంగానే ఉంటున్నా.. వారి మధ్యన అనుబంధం ఉంది అంటారు. అయితే రీసెంట్ గా నారా భువనేశ్వరి విషయంలో కొడాలి, వల్లభనేని వంశీలు నోరు పారేసుకున్న విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కర్ర విరగదు, పాము చావదు.. ఆంటే ఫ్యామిలీ కి అనుకూలంగాను, కొడాలి నాని వాళ్ళని పల్లెత్తుమాట అనకుండా స్పందించడంపై ఆయన అభిమానులే ఫైర్ అయ్యారు.
అయితే తాజాగా కొడాలి నాని మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని మేము ఏమి నలేదు, నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ కోసం ఆయన నాటకాలాడుతున్నారు, ఆయన బ్రతికుండడం కూడా వేస్ట్, జూనియర్ ఎన్టీఆర్ తో మాకు సంబంధం ఏమిటి.. ఆయనతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు, ఒకప్పుడు కలిసి ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎన్టీఆర్ మేము కలిసి లేము, విడిపోయాం అంటూ సెన్సేషనల్ గా మాట్లాడాడు కొడాలి నాని. మరి నిజంగా నాని చెప్పినట్టుగా కొడాలి కి ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఎలాంటి సంబంధాలు లేవంటారా.. అనేది ఇప్పుడు నెటిజెన్స్ వేస్తున్న ప్రశ్న.