Advertisement
Google Ads BL

ఇక సినిమా ఇండస్ట్రీకి గడ్డుకాలమే


ఏపీలో థియేటర్స్ కష్టాలు, టికెట్స్ కష్టాలు తీర్చమంటూ టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్స్ ఏపీ సీఎం జగన్ చుట్టూ తిరుగుతున్నారు. మొదట్లో మెగాస్టార్ చిరు పెద్దగా కదిలిన ఇండస్ట్రీ.. తర్వాతర్వాత ఎవరికి వారే జగన్ ని మీట్ అవడం, ఏపీ మంత్రి పేర్ని నాని ని మీట్ అయ్యి.. ఇండస్ట్రీకి సానుకూలంగా టికెట్ రేట్స్ విషయంలో ప్రభుత్వ పెద్దలని వేడుకున్నా పని జరగడం లేదు. నాగార్జున పర్సనల్ గా జగన్ ని కలిసి లంచ్ చేసినా ఉపయోగం లేదు. ఇక మళ్ళీ టాలీవుడ్ బడా నిర్మాతలు మరోమారు ఏపీ ప్రభుత్వాన్ని విన్నవించుకోవడానికి బయల్దేరే ఏర్పాట్లలో ఉన్నారు. కారణం అఖండ, పుష్ప, ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ మూవీస్ వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి ఇలాంటి సమయంలో టికెట్ రేట్స్, నాలుగు షో ల నిబంధలు గురించిన విషయాలను ప్రభుత్వంతో మాట్లాడాలని డిసైడ్ అవుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీకి భారీ షాక్ ఇచ్చేసింది. 

Advertisement
CJ Advs

తాజాగా సినిమాల విషయంలో అసెంబ్లీలో  సినిమా చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. దానిలో భాగంగా మంత్రి పేర్ని నాని  సినిమా అనగానే తమకి ఎదురుండకూడదన్న ధోరణిలో కొందరు ఉన్నారని, పేద, మధ్యతరగతి వాళ్ల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని.. సినిమా షోలను ఇష్టానుసారంగా వేస్తున్నారని, చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్నారని అన్నారు. కొందరు ఇష్టానుసారం ధరలను పెంచుకుంటున్నారని, అందుకే ఆన్‌లైన్ విధానంలో టికెట్ ఇచ్చే పద్ధతి తేవలనుకున్నామని వివరించారు. దాంతో పాటు సినిమా షోలను కూడా అదుపు చెయ్యాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడవాలని తెలిపారు. 

సినిమా కలెక్షన్లు, కడుతున్న టాక్సులకు సంబంధం లేదని చెప్పారు. ప్రభుత్వ పోర్టల్ ద్వారా పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండే ధరకి టికెట్లను తీసుకోస్తామని తెలిపారు. దీనిపై కొన్ని పార్టీలు, పేపర్లు, టీవీలు బురద వెయ్యడం దుర్మార్గమని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అందరు తమ విధానాలను స్వాగతించారని పేర్కొన్నారు. అలాగే నాలుగు షో ల నిబంధన విషయంలో ప్రభుత్వం అలోచించి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. ఈ లెక్కన పెద్ద నిర్మాతలు గుండెల్లో రాయి పడినట్లయింది. అంటే పెద్ద సినిమాలు రోజుకు ఆరు షోస్ పడేలా ప్లాన్స్ ఉంటాయి. మొదటి మూడు రోజులు కీలకం కాబట్టి అలా ఆరు షోస్ కోసం అనుమతి తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి మొండి చెయ్యి చూపించేసింది. 

No To Extra Shows, Exorbitant Ticket Rates : AP Government:

No To Extra Shows, Exorbitant Ticket Rates : AP minister Perni Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs