Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీస్ పై ఫుల్ క్లారిటీ


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కోసం వెయిటింగ్. రామ్ చరణ్ తో కలిసి క్రేజీ మూవీలో నటించిన ఎన్టీఆర్ కి ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం కావడంతో అందరిలో ఉత్కంఠ ఉంది. అలాగే ఎన్టీఆర్ కి కూడా ఉంది. ఇక బుల్లితెర మీద ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ సామాన్యులు, సెలబ్రిటీస్ తో గేమ్ షో ఆడుతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లు భార్య లక్ష్మి ప్రణతి తో కలిసి పారిస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని రివీల్ చెయ్యడమే కాదు.. ఆ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కబోతున్నాయో చెప్పి ఫాన్స్ కి కిక్ ఇచ్చాడు.

Advertisement
CJ Advs

కొరటాలతో NTR30 చెయ్యబోతున్న ఎన్టీఆర్.. ఆ సినిమాని ఫిబ్రవరి 2022 న సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నటుగా రివీల్ చేసాడు. తన తదుపరి మూవీ ని కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చెయ్యబోతున్నట్టుగా చెప్పాడు ఎన్టీఆర్. ఇక భారీ బడ్జెట్ తో మొదలు కాబోయే ఈ సినిమా ని 2022 అక్టోబర్ లో సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నట్టుగా చెప్పి ఫాన్స్ ని మరింత సర్ ప్రైజ్ చేసాడు ఎన్టీఆర్. ఒకే ఏడాది రెండు సినిమాలను మొదలు పెట్టబోతున్నట్లుగా.. అవి కూడా పాన్ ఇండియా మూవీస్ గా చెయ్యబోతున్నట్టుగా చెప్పిన ఎన్టీఆర్ .. ఆర్.ఆర్.ఆర్ మూవీ ని డైరెక్ట్ చేసిన రాజమౌళి టాస్క్‌మాస్టర్ అంటూ కితాబునిచ్చేసాడు. 

Speculation on NTR next project shoots:

When will NTR power his next projects?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs