Advertisement
Google Ads BL

రాజమౌళి నరకం చూపించారంటున్న ఎన్టీఆర్


జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. అందరి చూపు ఆర్.ఆర్.ఆర్ పైనే ఉండేలా రాజమౌళి మూవీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు కలయికలో వస్తున్న ఈ సినిమాలో వారి కాంబోలో వచ్చిన నాటు నాటు సాంగ్ ఏ రేంజ్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ డాన్స్ లో ఎంత ప్రొఫెషనల్స్ అనేది వారి గత సినిమాలు చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటి ప్రొఫెషనల్ డాన్సర్స్ చేత రాజమౌళి నాటు నాటు సాంగ్ కోసం ఎంతెలా కష్టపెట్టేశాడో.. ఎన్టీఆర్ మాటల్లో.. 

Advertisement
CJ Advs

తాజాగా ఎన్టీఆర్ ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యూట్యూబ్ లో రికార్డ్ లైక్స్ తో దూసుకుపోతున్న నాటు నాటు సాంగ్ కోసం ఎంతగా కష్టపడ్డారో చెప్పాడు ఎన్టీఆర్. నాటు నాటు పాటలోని హుక్‌ స్టెప్‌, కాళ్లు కుడి, ఎడమ, ముందు, ఇలా అన్ని స్టెప్స్ పర్ఫెక్ట్‌గా సింక్‌ అయ్యేందుకు నేను చరణ్ దాదాపుగా 15 నుండి 18 టేక్స్‌ తీసుకున్నాం. ఈ పాట విషయంలో మా డైరెక్టర్ రాజమౌళి ఇద్దరికీ నరకం చూపించారు. అసలు ఇద్దరి స్టెప్స్ సింక్ లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి రాజమౌళి మధ్యలో స్టెప్స్ ఆపేసేవారు. అలా మమ్మల్ని ముప్పుతిప్పలు పెట్టేసారు. ఈ సాంగ్ ని ఉక్రెయిన్ లో చిత్రీకరించారని చెప్పిన ఎన్టీఆర్.. ఈ సాంగ్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసాకే రాజమౌళి గారి గొప్పదనం, ఆయన విజన్ అర్ధమైంది అని చెప్పారు ఎన్టీఆర్.

Rajamouli forced NTR, Ram Charan with multiple takes for Naatu Naatu:

RRR shock: NTR, Ram Charan multiple takes for Naatu Naatu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs