Advertisement
Google Ads BL

పెళ్లిపై రకుల్ ట్విస్ట్


పర్సనల్ విషయాలను మీడియా కి దూరంగా ఉంచే రకుల్ ప్రీత్ ప్రొఫెషనల్ విషయాలను మాత్రం తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. గత ఏడాది డ్రగ్స్ కేసు, ఈ ఏడాది మని లాండరింగ్ కేసుల్లో ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ కి తెలుగులో ఆఫర్స్ లేవు కానీ.. బాలీవుడ్ పాగా వెయ్యడానికి గట్టిగానే ట్రై చేస్తుంది. అక్కడ పలు ప్రాజెక్ట్స్ తో రకుల్ బిజీ గా మారడమే కాదు.. రీసెంట్ గా బాలీవుడ్ లోనే బాయ్ ఫ్రెండ్ ని పట్టేసింది. ఆ విషయాన్ని సాంఘీక మాధ్యమాల ద్వారా అభిమానాలకి షేర్ చేసింది. బాలీవుడ్ హీరో కం ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ ప్రేమలో మునిగి తేలుతుంది.

Advertisement
CJ Advs

అయితే రీసెంట్ గా రకుల్ ప్రీత్ ని బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ గురించి అడగడమే కాకుండా.. జాకీ భగ్నానీ తో పెళ్లి ఎప్పుడు అనగానే రకుల్.. ట్విస్ట్ ఇచ్చింది. అంటే నా పర్సనల్ విషయంలో గాసిప్స్ స్ప్రెడ్ అవడం ఇష్టం లేదు. కాబట్టే నా బాయ్ ఫ్రెండ్ ని మీకు పరిచయం చేశాను. నేను ప్రొఫెషనల్ గా ఇంకా సాధించాల్సింది ఉంది.. ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను. నా ప్రేమ గురించి ఎప్పుడు చెప్పాల్సి వచ్చిందో అప్పుడే మీకు చెప్పాను. ఏది అప్పుడు చెప్పాలో, ఏది ఎప్పుడు జరుగుతుందో అది అప్పుడే జరుగుతుంది. అలాగే నా పెళ్లికి సంబంధించిన టైమ్ వచ్చిన తప్పకుండా అందరికి చెబుతాను.. మీకు చెప్పే పెళ్లి చేసుకుంటాను అంటూ రకుల్ పెళ్లి విషయాన్ని సస్పెన్సు లో పెట్టింది. అంటే రకుల్ పెళ్లి ఇప్పట్లో లేనట్లే అంటూ ఫాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.

Rakul Preet breaks silence about wedding with boyfriend Jackky Bhagnani:

Rakul Preet Singh Reveals Her Wedding Plans With Jackky Bhagnani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs