Advertisement
Google Ads BL

లుక్స్ తోనే అంచనాలు పెంచుతున్న బంగార్రాజు


అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. ఆ సినిమాలో  కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. ఆ సినిమాలో తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు. ప్రస్తుతం  సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న బంగార్రాజు చిత్రంతో ఈ ఇద్దరూ మరో సారి మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో నాగార్జున పంచెకట్టుతో మెస్మరైజ్ చేస్తే.. రమ్యకృష్ణ సత్యభామగా సారీస్ లో అందంగా పవర్ ఫుల్ లేడీగా కనిపించింది. ఇక రీసెంట్ గా కృతి శెట్టి నాగ లక్ష్మి లుక్ అందరిని పడేసింది. అచ్చతెలుగు ఆడపడుచుల లంగావోనిలో అదరగొట్టేసింది. 

ఇక నాగ చైతన్య బర్త్ డే ( నవంబర్ 23) సందర్బంగా టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. కానీ అంత కంటే ముందుగానే చైతూకి సర్ ప్రైజ్ గా నాగ చైతన్య పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను  విడుదల చేశారు. చేతిలో కర్ర పట్టుకుని నాగ చైతన్య కనిపించడం, ఆ గెటప్, చేతికి బ్రాస్ లెట్ ఇలా అన్ని చూస్తుంటే పాత్ర మీద అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది.

రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న బంగార్రాజు చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు. నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనున్నారు. 

Naga Chaitanya First Look In Bangarraju Revealed:

<span>Naga Chaitanya First Look In Akkineni Nagarjuna, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangarraju Revealed</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs