Advertisement
Google Ads BL

రామోజీ రావు - ఎన్టీఆర్ మధ్య డిస్కర్షన్ ఏంటి?


ఇప్పుడు టీడీపి యంగ్ బ్లడ్ మొత్తం ఎన్టీఆర్ వైపే చూస్తుంది. మునిగిపోతున్న నావకి ఎన్టీఆర్ చుక్కాని అయితే బావుంటుంది.. మళ్ళీ టీడీపి పుంజుకుంటుంది ఇది యూత్ టీడీపి కార్యకర్తల్లో ఉన్న ఆలోచన. ఇదే విషయాన్నీ టీడీపి అధ్యక్షుడు  చంద్రబాబు దగ్గర పదే పదే ప్రస్తావిస్తున్నారు కూడా. అయినా చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ చెప్పకుండా కామ్ గా ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపి పరిస్థితి ఎలా తయారయ్యిందో అందరూ చూస్తున్నారు. ప్రతిపక్షం కదా అని నోరెత్తితే.. వాళ్ళని జైల్లో పెట్టించేస్తుంది వైసిపి సర్కార్. అందుకే ఎవరూ ప్రభుత్వం చేసే అవినీతి, వారు చేసే పనులపై నోరు పమెదపడం లేదు. ఆఖరికి అధినేత భార్యనే ఇష్టం వచ్చినట్లుగా వైసిపి మంత్రులు మాట్లాడినా.. చేసేది లేక శపధాలు చెయ్యడం తప్పించి.. ఏం జరగలేదు . అయితే ఎప్పటినుండో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే వాదనకి కొన్ని సర్వేలు కూడా తోయుడయ్యాయి. 

Advertisement
CJ Advs

చాలామంది చంద్రబాబు, లోకేష్, ఎన్టీఆర్ లలో టిడిపి అధ్యక్షుడిగా ఎవరు ఉంటే బావుంటుంది అనే సర్వేలు నిర్వహించగా.. అందులో ఎన్టీఆర్ ఏ టాప్ లో నిలుస్తున్నాడు.ఈ సర్వేల విషయాన్ని ఈటివి, ఈనాడు అధినేత రామోజీ రావు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. అయినా చంద్రబాబు ఏం మాట్లాడలేదు అని, దానితో రామోజీ రావు మరో స్టెప్ తీసుకున్నారని అంటున్నారు.

అందులో భాగంగానే రామోజీ రావు జూనియర్ ఎన్టీఆర్ ని పిలిపించి ఈ పార్టీ విషయమై మాట్లాడారని, నువ్వు రావాలి.. పార్టీని నిలబెట్టాలని రామోజీ రావు ఎన్టీఆర్ కి చెప్పినట్లుగా, ఎన్టీఆర్ కూడా నేను అలోచించి నా నిర్ణయాన్ని ఏప్రిల్ 2022 లోపు చెబుతాను అని, ఎలక్షన్స్ కి ఇంకా టైం ఉంది కాబట్టి.. అప్పటిలోగా తన నిర్ణయాన్ని తెలియజేస్తానని రామోజీ రావు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఎన్టీఆర్ నిర్ణయంతో మరోసారి రామోజీ రావు.. చంద్రబాబు తో మాట్లాడి ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారని, ఎన్టీఆర్ గనక టీడీపీ ని పట్టించుకోకపోతే.. పార్టీ సర్వనాశనం అవుతుంది అని.. అందుకే ఎన్టీఆర్ చేతుల్లో పార్టీ పెట్టడమే కరెక్ట్ అని రామోజీ రావు చంద్రబాబు ని ఒప్పించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Ramoji Rao meeting with NTR?:

Eenadu MD Ramoji Rao meeting with Young Tiger NTR?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs