బిగ్ బాస్ సీజన్ 5 లో ఇప్పటివరకు 11 మంది ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ ని వీడారు.. నాలుగైదు ఎలిమినేషన్స్ వరకు ఎలిమినేషన్స్ ఎపిసోడ్ లో చాలా మజా వచ్చింది బుల్లితెర ప్రేక్షకులకి. అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వెళుతూ వెళుతూ.. హౌస్ లోని కంటెస్టెంట్స్ ని నానా మాటలు అంటూ ఆసక్తిని రేపేవారు. సరయు వెళుతూ సన్నీ, షణ్ముఖ్, సిరిలని తిట్టి పోయింది. ఇక ఉమాదేవి కూడా అంతే. నటరాజ్ అయితే రవిని గుంటనక్క అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. విశ్వ ని ఊసరవెల్లి అంటూ నటరాజ్ మాస్టర్ కాస్త ఎగ్రెస్సివ్ గానే వెళ్ళాడు. లహరి కూడా వెళుతూ వెళుతూ కాజల్, ప్రియా లని మిమ్మల్ని నమ్మలేదు అంది.
కానీ గత రెండు మూడు వారాలుగా అంటే విశ్వ, జెస్సి, అని మాస్టర్ ఎలిమినేషన్స్ రోజు మాత్రం హౌస్ మేట్స్ ని పొగుడుతూ స్టేజ్ పై నుండి వెళ్లారు కానీ.. ఎక్కడా హౌస్ మేట్స్ పై బ్యాడ్ కామెంట్స్ కానీ, తిట్టడం కానీ చెయ్యలేదు.. అలాగే హౌస్ మేట్స్ అసలు రంగులు బయట పెట్టలేదు. ఇలాంటి ఎలిమినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్ ప్రేక్షకులకి రుచించడం లేదు. అని మాస్టర్ వెళుతూ వెళుతూ రవి తమ్ముడు అని, శ్రీరామ్ సూపర్ అని, సిరి చిచ్చర పిడుగు అని, సన్నీ గేమ్ బాగా ఆడతాడని చెప్పింది. కాజల్ గురించి ఏమన్నా మాట్లాడుతుంది అనుకుంటే.. ఆమె గురించి మాట్లాడడానికి ఏం లేదు అంది.. అలా జెస్సి కూడా హౌస్ మేట్స్ ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు కానీ.. ఎక్కడా సంచలనంగా మాట్లాడలేదు. ఇక విశ్వ కూడా నార్మల్ గా చెప్పి వెళ్ళిపోయాడు అంతే.. అందుకే ఈ ఎలిమినేషన్స్ లో మజా లేదు బాస్ అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు.