సింగర్ శ్రీరామ్ ఈమధ్యన బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ ఫెవరెట్ గా మారాడు. గత రెండు వారాలుగా ఓటింగ్ లో కూడా శ్రీరామే ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. హమీద ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రొమాంటిక్ గా కనిపించిన శ్రీరామ చంద్ర.. ఆమె వెళ్ళాక డల్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ సన్నీ తో గొడవ పడుతూ హైలెట్ అవ్వడమే కాదు.. ఆయనకి సెలెబ్రిటీ సపోర్ట్ కూడా పెరుగుతుంది. అయితే షణ్ముఖ్ ఎప్పుడూ ఫ్యాన్ ఫాలోయింగ్ లో, ఓటింగ్ లో ఫస్ట్ ప్లేస్ లోనే ఉండేవాడు. షణ్ముఖ్ కి పోటీగా శ్రీరామ్ చంద్రకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. మరి హౌస్ లో సన్నీ, మానస్ లతో గొడవ పడే శ్రీరామ్ చంద్ర మళ్ళీ డల్ అయ్యాడు.
అంటే ఎవరు గొడవ పడుతున్నా తన పని చూసుకోవడం, అందరూ మీటింగ్ పెట్టుకున్నా.. సైలెంట్ గా కూర్చోవడం, అని మాస్టర్ తో కబుర్లు చెప్పడం.. కెప్టెన్ రవి కి గేమ్ సూచనలు ఇవ్వడం తప్ప టాస్క్ ల్లో పెరఫార్మెన్స్ తగ్గిపోయింది.. ఇంకా శ్రీరామ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా తగ్గింది అనిపిస్తుంది. అంటే కావాలనే బిగ్ బాస్ శ్రీరామ్ ని ట్రాక్ నుండి తప్పిస్తున్నారా.. గతంలో షణ్ముఖ్ టాస్క్ పెరఫార్మెన్స్ లేకపోయినా, ఆయన్ని హైలెట్ చేసిన బిగ్ బాస్ ఇప్పుడు శ్రీరామచంద్ర విషయానికి వచ్చేసరికి ఎందుకిలా అంటూ ఆయన ఫాన్స్ మండిపడుతున్నారు. బిగ్ బాస్ టైటిల్ కొట్టేసేలా శ్రీరామ చంద్ర కనిపించగానే.. బిగ్ బాస్ కావాలనే ఆయన్ని తొక్కేస్తున్నారంటూ శ్రీరామచంద్ర ఫాన్స్ కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.