Advertisement
Google Ads BL

చంద్రబాబుకు సోనూసూద్ ఫోన్


గత శుక్రవారం అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అవమానకర వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబుకు నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ తో పాటుగా మెగా బ్రదర్స్ పవన్ ఇంకా నాగబాబు సపోర్ట్ కూడా వచ్చేసింది. ఇక సినిమా ఇండస్ట్రీ నుండే కాకుండా.. బిజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబు ని ఫోన్ లో ఓదార్చారు. తాజాగా నటుడు సోనూసూద్ కూడా చంద్రబాబు ని ఫోన్ లో పరామర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవ్వాల్సిన అసెంబ్లీలో ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు. శాసనసభలో విధ్వంస ధోరణి సరికాదని.. తాను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చంద్రబాబును కలుస్తానని సోనూసూద్ చెప్పారు.

Advertisement
CJ Advs

ఇక సోను సూద్ సినిమాలతోనే కాకుండా.. కరోనా క్రైసిస్ టైం లో సేవా కార్యక్రమాలతో.. ఆయన పేరు మార్మోగిపోయింది. సెకండ్ వేవ్ టైం లోను ప్రజల ప్రాణాల కోసం ఆక్సిజెన్ సిలిండర్లు ఏర్పాటు చెయ్యడం, దాని కోసం ఆయన ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసారు. ఇంకా నిరుపేద కుటుంబాలకు దేవుడిలా సోను సూద్ సేవలు అందరూ కొనియాడుతున్నారు. 

Sonu Sood callas Chandrababu Naidu :

Sonu Sood callas CBN
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs