Advertisement
Google Ads BL

మహేష్ - రాజమౌళి కాంబో: ఆయన విలన్


రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ మరియు సినిమా ప్రమోషన్స్ లో తలమునకలయ్యారు. అయితే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని జనవరి 7 న రిలీజ్ చేసి.. తర్వాత సక్సెస్ మీట్స్, ఇంకా కొన్ని ప్రమోషన్స్ తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి మహేష్ మూవీ పై కూర్చుంటాడని తెలుస్తుంది. ఈలోపు మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేసి రిలాక్స్ అవుతాడు. అయితే ముందు త్రివిక్రమ్ తోనా? లేదా రాజమౌళి తోనా? మహేష్ మూవీ అనేది క్లారిటీ లేకపోయినా.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం మహేష్ కథని అప్పుడే రెడీ చేసినట్లుగా టాక్ ఉంది. అప్పుడప్పుడు ఆయన కథపై హింట్స్ కూడా ఇస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో విలన్ గా ఓ సూపర్ హీరోని తీసుకోబోతున్నారనే  న్యూస్ మొదలైంది. అది తమిళ హీరో చియాన్ విక్రమ్ ని మహేష్ తో పోటీ పడే విలన్ గా చూపించాలని రాజమౌళి డిసైడ్ అయ్యారని, ఇందులో విలన్ పాత్ర ఎంతో స్టైలిష్‌గా ఉండబోతుందని చెబుతున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీకి విక్రమ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతారని రాజమౌళి అనుకోవడమే కాదు.. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆయనతో సంప్రదింపులు కూడా జరిపిందనే టాక్ వినిపిస్తోంది. మరి మహేష్ బాబు తో రాజమౌళి చెయ్యబోయే మూవీలో విక్రమ్ నిజంగా విలన్ అయితే.. సినిమాపై భారీ క్రేజ్ వచ్చెయ్యడం ఖాయం. 

Rajamouli: Mahesh, The Villainous Star:

Tamil star for Superstar Mahesh Babu & SS Rajamouli project?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs