కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ RC15 మూవీ అంటే మెగా ఫాన్స్ లో ఆనందం, ట్రేడ్ లో అంచనాలు. శంకర్ అంటే భారీతనం, భారీతనం అంటే శంకర్. అలాంటి శంకర్ తో రామ్ చరణ్ మూడు భాషల్లో చేస్తున్న RC15 పై ఎంత క్రేజ్ ఉంటుంది. ఇక శంకర్ తో రీసెంట్ గా RC15 ని పట్టాలెక్కించిన రామ్ చరణ్ ఫస్ట్ షెడ్యూల్.. పూణే లో పూర్తి చేసేసాడు. ఆ షెడ్యూల్ లో ఓ సాంగ్ అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కూడా మొదలు పెట్టి చరణ్ - కియారా లపై రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ స్టార్ట్ చేసారు. అయితే ఈ సినిమాలో ఏడు నిమిషాల ఓ భారీ యాక్షన్ సన్నివేశం కోసం దర్శకుడు శంకర్ 70 కోట్లు ఖర్చు పెడుతున్నాడనే న్యూస్ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీస్ ని షేక్ చేసింది.
ఇప్పుడు తాజాగా RC15 లో ఓ సాంగ్ కోసం 40 కోట్ల తో ఓ కాస్ట్లీ సెట్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేయిస్తున్నారనే న్యూస్ మెగా ఫాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రామ్ చరణ్ - కియారా అద్వానీ కాంబోలో తెరకెక్కబోయే ఓ డ్యూయెట్ కోసం శంకర్ ఏకంగా 40 కోట్ల సెట్ నిర్మాణం చేపట్టినట్టుగా ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శివాజీ సినిమాలో వాజీ వాజీ అనే పాటను పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేశారని తెలుస్తోంది. మరి శంకర్ తాను తెరకెక్కించిన సినిమాల్లో సాంగ్స్ కి ఎంత ఎక్కువ ఖర్చు చేస్తారో.. ఆ సాంగ్స్ విజువల్ గా చూస్తే అర్ధమవుతుంది. ఇప్పుడు చరణ్ మూవీ కోసము అదే చేస్తున్నారు శంకర్.