ఏపీ అసెంబ్లీ లో నారా భువనేశ్వరిపై జరిగిన అవమానంపై నందమూరి ఫ్యామిలీనే కాదు.. చాలామంది ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ అంతా మీడియా ముందుకు వచ్చి భువనేశ్వరిపై వైసిపి మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించగా.. కళ్యాణ్ రామ్ ఓ ప్రెస్ నోట్ వదిలారు.. తాతగారు విలువలను పాటించాలని చెప్పారు. ఇక నందమూరి ఫ్యామిలీ మెంబెర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం వీడియో షేర్ చేసారు. ఏపీ అసెంబ్లీలో ఆడవారిని టార్గెట్ చేసే సంసృతి మనకి వద్దు.. భావి తరాలకు మంచిని ఇద్దాం, ఇలాంటి చెడు ని కాదు అంటూ.. కర్ర విరక్కుండా పాము చావకుండా ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోపై నందమూరి ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబం పై అసెంబ్లీలో జరిగిన తీరుపై ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదు అంటూ ఫాన్స్ ఎన్టీఆర్ ని కడిగిపారేస్తున్నారు.
ఏదో నందమూరి కుటుంబ సభ్యుడిగా స్పందించాలి కాబట్టి.. ఈ ఘటనపై ఎన్టీఆర్ స్పందించాడు కానీ.. కావాలని స్పందించలేదు.. ఒకేవేళ ఏం మాట్లాడకపోయినా.. అభిమానులు ఊరుకోరు అనే రీతిలో ఎన్టీఆర్ స్పందన ఉంది కానీ.. చంద్రబాబు ని ఓదార్చే ప్రయత్నం చేయలేదు.. ఎన్టీఆర్ అనే పేరుతోనే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నావు. అలాంటిది ఆ ఆకుటుంబానికి ఓ సమస్య వస్తే..నువ్వు ధైర్యంగా నిలబడలేకపోయావు.. అసలు ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించకపోయినా బావుండేది అంటూ ఫాన్స్ ఎన్టీఆర్ పై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ కి డైరెక్ట్ గానే క్లాస్ పీకుతున్నారు.
కొంతమంది అభిమానుల అభిప్రాయాలు
ప్రజలు అపార్థం చేసుకుంటారని వచ్చాడు తప్ప ఆయనకు లోపల మహా ఆనందంగా వుంది
నాగబాబు గారు స్పందించిన తీరు చాలా బెటర్
అన్న నా అభిప్రాయం కూడా మీ అభిప్రాయమే
Jr ఎన్టీఆర్ అంటే నాకు కుడా చాచెంత అభిమానం, కానీ ఈ వీడియోలో మాట్లాడిన పరిస్థితి చూస్తే బాధేస్తుంది అన్న
జై టీడీపీ
నా రక్తం,నా వంశం,నా తాత, ఈ వన్ని సినిమా డైలాగ్స్ కే పరిమితం అంతే, మీరు ఒక్క డైలాగ్ కేవలం మి వంశం కోసం పవర్ ఫుల్ గా చెప్పి వుంటే అన్న, మి తాత గారు కాకుండా మేము ఆనందించేవారు
🙏అతను మాట్లాడిన విధానం సాధారణ వ్యక్తిలా ఉంది 🙏
Jr ntr garu, yes మీరు మాట్లాడిన విధానం చాలా బాధాకరం.. మీ పైన నాకు వున్న అభిప్రాయం పూర్తిగా పోయింది... అదే అన్న హరి కృష్ణ ఉండివుంటే మరోలా ఉండేది ... జై NTR